
ట్యాగ్ · 2268 కథనాలు · పేజీ 33


ప్రధాని మోదీని కలిసిన అక్కినేని ఫ్యామిలీ

రోషన్ కనకాల 'మోగ్లీ 2025' షూటింగ్ అప్డేట్

కన్నప్ప ఫస్ట్ సింగిల్ 'శివ శివ శంకర' వస్తోంది

మజాకా రిలీజ్ డేట్ ఫిక్స్

బాలకృష్ణను సత్కరించిన టాలీవుడ్ ప్రముఖులు

లైలా ఈవెంట్ కు మెగాస్టార్

జాక్ టీజర్ రిలీజ్

తండేల్ సెకండ్ హీరో దేవీనే

RC 16 షూటింగ్ అప్డేట్

లైలా ట్రైలర్ రిలీజ్

తండేల్.. డెఫినెట్‌గా మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది

జాక్ టీజర్ వచ్చేస్తోంది

సిద్ధార్థ్ 3BHK టైటిల్ టీజర్, ఫస్ట్ లుక్ లాంచ్

RC16 సెట్స్‌లో స్పెషల్ గెస్ట్

ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెప్పిన మెగాస్టార్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మేరకు తాజాగా ఆయన ప్రధానితో పాల్గొన్న వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సోషల్ మీడియా వేదికగా థ్యాంక్స్ చెప్పారు. కాగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది చివరిలో ‘వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్' అనే కార్యక్రమాన్ని నిర్వహించనుంది. భారత్‌ను గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా మార్చడమే దీని ముఖ్య ఉద్దేశం.

ప్రధాని మోదీని కలిసిన అక్కినేని ఫ్యామిలీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అక్కినేని కుటుంబం కలిసింది. ఈ మేరకు టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున సహా ఆయన కుటుంబసభ్యులు మరియు ఇతర అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ శుక్రవారం పార్లమెంట్ భవనంలో ప్రధానమంత్రిని కలుసుకున్నారు. కాగా లెజెండరీ నటుడు, అక్కినేని నాగేశ్వరరావు సినీ చరిత్ర, మరియు ఆయన సాధించిన విజయాలకు నివాళిగా పద్మభూషణ్ పురస్కార గ్రహీత యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ 'అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ' అనే పుస్తకాన్ని రచించారు.

రోషన్ కనకాల 'మోగ్లీ 2025' షూటింగ్ అప్‌డేట్
నటుడిగా ఎదుగుతున్న రోషన్ కనకాల ఒక్కొక్క అడుగుగా తనదైన ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంటున్నాడు. ప్రతీ చిత్రంతోనూ కేవలం వారసత్వాన్ని కొనసాగించడం కాదు తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును కూడా సొంతం చేసుకుంటున్నాడు. కథల ఎంపిక విషయంలో ఆయన చూపుతున్న చిత్తశుద్ధి, సంఖ్య కంటే నాణ్యతను ప్రాధాన్యమిస్తూ సాగే ఆయన నిర్ణయాలు సినిమాపై ఉన్న ఆసక్తిని ప్రతిబింబిస్తున్నాయి.

కన్నప్ప ఫస్ట్ సింగిల్ 'శివ శివ శంకర' వస్తోంది
హీరో విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప’. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ప్రతీ సోమవారం ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ రివీల్ చేసిన చిత్ర యూనిట్ అంతకుముందే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడి క్యారక్టర్ పోస్టర్ విడుదలచేసిన సంగతి గుర్తుండేవుంటుంది.

తెలుసు కదా నుండి సిద్ధు బర్త్ డే పోస్టర్స్ రిలీజ్
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు, ఈ సందర్భంగా ఆయన మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'తెలుసు కదా' నుండి ఒక బ్రాండ్ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో సిద్ధు తన మోస్ట్ స్టైలిష్ అవతార్ లో అదరగొట్టారు.

మజాకా రిలీజ్ డేట్ ఫిక్స్
పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’కి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్‌టైనర్‌లో రీతు వర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

బాలకృష్ణను సత్కరించిన టాలీవుడ్ ప్రముఖులు
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు విశేష సేవలు అందించిన ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి భారత ప్రభుత్వంచే పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించబడిన సందర్భంగా, తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు నందమూరి బాలకృష్ణ గారి నివాసానికి వెళ్లి ఆయనకు అభినందనలు తెలిపారు.

లైలా ఈవెంట్ కు మెగాస్టార్
యంగ్ హీరో విశ్వక్ సేన్ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా లైలా.వచ్చే వారంలో థియేటర్లలోకి రానుంది.ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు.అందులో భాగంగా హైదరాబాద్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు.దీనికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రానున్నారు.ఈరోజు హీరో విశ్వక్ అలాగే నిర్మాత సాహు గారపాటి,చిరంజీవి నివాసానికి వెళ్లి ఆయనను ఆహ్వానించారు.ఈనెల 9న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది.

జాక్ టీజర్ రిలీజ్
యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ,బొమ్మరిల్లు ఫేమ్ భాస్కర్ డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా జాక్ ..కొంచెం క్రాక్ అనేది ట్యాగ్ లైన్.టిల్లు స్క్వేర్ తరువాత సిద్దు నుండి వస్తున్న సినిమా ఇది. షూటింగ్ కూడా చివరిదశకు చేరుకుంది.ఈసినిమా నుండి ఈరోజు సిద్దు బర్త్ డే సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఇక ఈ టీజర్ ఇంట్రెస్టింగ్ గా వుంది. టీజర్ లో సిద్దు రోల్ ను మాత్రం రివీల్ చేయలేదు.అదే సినిమాకు ఇంట్రెస్ట్ గా మారనుంది.

తండేల్ సెకండ్ హీరో దేవీనే
తండేల్ ఈ రోజే మంచి అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చింది.ఊహించినట్లుగానే ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ తోపాటు సూపర్ అనే మౌత్ టాక్ ను సొంతం చేసుకుంటుంది.ముఖ్యంగా లీడ్ పెయిర్ యాక్టింగ్ గురించి అలాగే సంగీతం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.విడుదలకు ముందే దేవి శ్రీ ప్రసాద్ నుండి వచ్చిన మూడు పాటలు పెద్ద హిట్ అయ్యాయి.ఒకరకంగా సినిమాను ఎక్కువగా ప్రమోట్ చేసింది సాంగ్సే.

సంక్రాంతికి వస్తున్నాం ఓటిటి పార్టనర్ లాక్
సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది సంక్రాంతికి వస్తున్నాం.ఏకంగా 300కోట్ల గ్రాస్ మార్క్ ను దాటి ఆల్ టైం రీజినల్ ఇండస్ట్రీ హిట్ గా రికార్డు సృష్టించింది.ఈ సినిమాతో నేటితో 25డేస్ రన్ పూర్తి చేసుకోనుంది.ఫ్యామిలీ ఆడియన్స్ నుండి ఈసినిమాకు సూపర్ సపోర్ట్ లభించింది. ఇక సంక్రాంతికి వస్తున్నాం ఓటిటి డీల్ కూడా పూర్తయినట్లు సమాచారం.డిజిటల్ హక్కులను జీ 5 దక్కించుకోగా శాటిలైట్ హక్కులు జీ తెలుగు సొంతం చేసుకున్నాయి.ఈ రెండు హక్కులు భారీ ధర పలికాయి.

RC 16 షూటింగ్ అప్డేట్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన 16వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సనా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.ఇక నిన్నటి తో ఈసినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.వారం రోజులపాటు హైదరాబాద్ లోని బూత్ బంగ్లాలో జరిగిన ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇందులో నిన్న మిర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.ఈసినిమాలో తను ప్రతినాయకుడిపాత్రలో కనిపించనున్నాడు. సౌత్ లో ఇదే తనకు మొదటి సినిమా.

ఓటీటీలోకి వచ్చేసిన గేమ్ ఛేంజర్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ ఫిల్మ్ 'గేమ్ ఛేంజర్'. 'ఆర్ఆర్ఆర్' తర్వాత చరణ్ సోలో హీరోగా వచ్చిన సినిమా కావడం, దీనికి ప్రముఖ తమిళ్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వం వహించడంతో తొలినుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో గత నెలలో సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే.

బాలకృష్ణకు టీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు అభినందనలు
టీఎఫ్‌డీసీ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు బాలకృష్ణకు అభినందనలు తెలిపారు. పద్మభూషణ్ పురస్కారం పొందిన తర్వాత తొలిసారి బాలయ్యను కలిసిన దిల్ రాజు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఇందుకు సంబంధించి దిల్ రాజు ఆధ్వర్యంలోని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా బాలయ్యతో దిల్ రాజు కలిసిఉన్న ఫోటోను పోస్ట్ చేసింది.

లైలా ట్రైలర్ రిలీజ్
'మాస్ కా దాస్' విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'లైలా'. రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మూవీ ప్రమోషన్స్ ముమ్మురం చేసారు మేకర్స్.

తండేల్.. డెఫినెట్‌గా మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా హీరో అక్కినేని నాగచైతన్య విలేకరుల సమావేశంలో ‘తండేల్’ విశేషాలు పంచుకున్నారు.

జాక్ టీజర్ వచ్చేస్తోంది
డీజే టిల్లు ఫ్రాంచైజీ చిత్రాల బ్లాక్‌బస్టర్ తర్వాత స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘జాక్ - కొంచెం క్రాక్’. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కలయికలో సరికొత్త జోనర్‌లో ‘జాక్- కొంచెం క్రాక్’ మూవీ రూపొందుతోంది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.

కన్నప్ప.. ఒకటే మాట
ట్యాలెంటెడ్ హీరో విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్ వస్తుందని ఇంతకుముందు ఆయన ప్రకటించిన సంగతి గుర్తుండేవుంటుంది. చెప్పినట్టుగానే ఈ భారీ ప్రాజెక్టు నుంచి ప్రతీ సోమవారం ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందిస్తున్నారు.

సిద్ధార్థ్ 3BHK టైటిల్ టీజర్, ఫస్ట్ లుక్ లాంచ్
'నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా, బొమ్మరిల్లు' సినిమాలతో తెలుగులో స్టార్‌డమ్ అందుకున్న హీరో సిద్ధార్థ్. అయితే ఆ తర్వాత ఆయన నటించిన చిత్రాలేవీ చెప్పుకోదగ్గ హిట్ కాలేదు. దీంతో సిద్ధార్థ్ తన మాతృభాష తమిళంలోనే వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే అక్కడ హిట్ అయిన కొన్ని చిత్రాలను తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నాడు.

RC16 సెట్స్‌లో స్పెషల్ గెస్ట్
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ ఇటీవలే 'గేమ్ ఛేంజర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా ఆయన సెన్సిబుల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని చేస్తున్న ఇషయం తెలిసిందే. ‘RC16’ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోన్న ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోంది.