ప్రధాని మోదీని కలిసిన అక్కినేని ఫ్యామిలీ

Actor Nagarjuna and Akkineni Family Members Meets PM Modi, Gifts Book on ANR

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అక్కినేని కుటుంబం కలిసింది.‌ ఈ మేరకు టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున సహా ఆయన కుటుంబసభ్యులు మరియు ఇతర అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ శుక్రవారం పార్లమెంట్ భవనంలో ప్రధానమంత్రిని కలుసుకున్నారు. కాగా లెజెండరీ నటుడు, అక్కినేని నాగేశ్వరరావు సినీ చరిత్ర, మరియు ఆయన సాధించిన విజయాలకు నివాళిగా పద్మభూషణ్ పురస్కార గ్రహీత యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ‘అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ’ అనే పుస్తకాన్ని రచించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా ఈ పుస్తక ప్రతిని ప్రధాని మోదీకి అందజేసింది అక్కినేని ఫ్యామిలీ. ఈ క్రమంలో ఇటీవలే వివాహం చేసుకున్న నాగార్జున తనయుడు, హీరో నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల జంట ప్రధానికి కొండపల్లి బొమ్మను బహుమతిగా అందజేశారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమపై చూపిన ఔదార్యానికి కృతజ్ఞతలు తెలిపారు నాగార్జున. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు.

“ఈరోజు పార్లమెంట్ హౌస్‌లో జరిగిన సమావేశానికి గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీకి ప్రగాఢ కృతజ్ఞతలు. పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ చేత ‘అక్కినేని క విరాట్ వ్యక్తిత్వ’ ప్రతిని అందించడం గొప్ప అనుభూతి. మా నాన్నగారు ఏఎన్ఆర్ గారి సినీ వారసత్వానికి ఇది నివాళి. ఆయన సినిమాలకోసం జీవితకాలం చేసిన కృషికి మీరు ఇచ్చిన ఈ గుర్తింపు.. మా కుటుంబానికి, అభిమానులకు మరియు భారతీయ సినీ ప్రేమికులకు ఒక విలువైన ఆస్థి. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞులం.” అని పేర్కొన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.