ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెప్పిన మెగాస్టార్

Megastar Chiranjeevi Thanks PM Modi

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మేరకు తాజాగా ఆయన ప్రధానితో పాల్గొన్న వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సోషల్ మీడియా వేదికగా థ్యాంక్స్ చెప్పారు. కాగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది చివరిలో ‘వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌’ అనే కార్యక్రమాన్ని నిర్వహించనుంది. భారత్‌ను గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ హబ్‌గా మార్చడమే దీని ముఖ్య ఉద్దేశం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖ నటీనటులు, వ్యాపారవేత్తలతో ప్రధాని మోదీ రీసెంట్‌గా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వారి నుంచి కీలక సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఇక సమావేశం అనంతరం చిరంజీవి అడ్వైజరీ బోర్డ్‌లో భాగం కావడం ఎంతో ఆనందంగా ఉందంటూ ట్వీట్‌ చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఒక ప్రత్యేక పోస్ట్‌ పెట్టారు. దీనికి ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతోన్న వీడియోను పంచుకున్నారు.

“గౌరవనీయులైన శ్రీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీ గారికి ధన్యవాదాలు. వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES) కోసం అడ్వైజరీ బోర్డ్‌లో భాగం కావడం మరియు ఇతర గౌరవనీయ సభ్యులతో కలిసి నా ఆలోచనలు పంచుకోవడం నిజంగా ఒక విశేషం. WAVES ప్రోగ్రాం సక్సెస్ అవుతుందనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు” అని అందులో పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి.

కాగా ఈ సమావేశంలో టాలీవుడ్ నుంచి చిరంజీవి, నాగార్జున పాల్గొనగా.. లెజెండరీ నటులు అమితాబ్‌ బచ్చన్‌, మిథున్‌ చక్రవర్తి, రజనీకాంత్‌ సహా షారుఖ్‌ఖాన్‌, ఆమిర్‌ఖాన్‌, అక్షయ్‌కుమార్‌, అనిల్‌కపూర్‌, అనుపమ్‌ ఖేర్‌, హేమామాలినీ, దీపికా పదుకొణె తదితరులు పాల్గొన్నారు. అలాగే వ్యాపారవర్గాల నుంచి రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ, ఆనంద్‌ మహీంద్రా తదితరులు ఈ సమావేశంలో పాల్గొని సమ్మిట్‌పై వారి అభిప్రాయాలు పంచుకున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.