బాలకృష్ణను సత్కరించిన టాలీవుడ్ ప్రముఖులు

TFI Celebs Congratulated Nandamuri Balakrishna For Padma Bhushan Award

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు విశేష సేవలు అందించిన ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి భారత ప్రభుత్వంచే పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించబడిన సందర్భంగా, తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు నందమూరి బాలకృష్ణ గారి నివాసానికి వెళ్లి ఆయనకు అభినందనలు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మొత్తం ఇండస్ట్రీ నుండి 10 అసోసియేషన్స్ అండ్ యూనియన్స్ మెంబర్స్ పాల్గొన్నారు. ఈ క్రమంలో వారు నందమూరి బాలకృష్ణ గారికి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. కాగా త్వరలో బాలకృష్ణ గారిని సన్మానించేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ఘనంగా ఏర్పాట్లు చేస్తునట్టు తెలియజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నందమూరి బాలకృష్ణ గారు నటుడిగానే కాదు, సినీ పరిశ్రమకు, సేవా కార్యక్రమాలకు చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కడం ఎంతో గర్వించదగ్గ విషయం” అని పేర్కొన్నారు.

ఇక అనంతరం పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ.. “ఈ అవార్డు నాకు, మా కుటుంబానికే కాదు, తెలుగు సినీ పరిశ్రమకు వచ్చిన గౌరవం. ఇది నాకు మరింత బాధ్యతను పెంచింది” అని అన్నారు.

కాగా బాలయ్యను కలిసిన వారిలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పి భరత్ భూషణ్ గారు, సెక్రటరీ కె ఎల్ దామోదర్ ప్రసాద్ గారు, కోశాధికారి తుమ్మల ప్రసన్న కుమార్ గారు.. అలాగే తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కె ఎల్ దామోదర్ ప్రసాద్ గారు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి గారు, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ సెక్రటరీ కె అనుపమ్ రెడ్డి గారు ఉన్నారు.

అలాగే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్ గారు,సెక్రటరీ కె అమ్మిరాజు గారు, కోశాధికారి వి సురేష్ గారు, తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్ సెక్రెటరీ ఉమర్జీ అనురాధ గారు మరియు తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ప్రెసిడెంట్ కె అమ్మిరాజు గారు ఉన్నారు.

ఇంకా చిత్రపురి హిల్స్ ప్రెసిడెంట్ & తెలుగు సినీ,టీవీ జూనియర్ ఆర్టిస్ట్స్ యూనియన్ సెక్రటరీ వల్లభనేని అనిల్ కుమార్ గారు, తెలుగు సినీ,టీవీ అవుట్ డోర్ యూనిట్ టెక్నిషన్స్ యూనియన్ సెక్రటరీ వి సురేష్ గారు, తెలుగు సినీ స్టంట్ డైరెక్టర్స్ & స్టంట్ ఆర్టిస్ట్స్ యూనియన్ కోశాధికారి రమేష్ రాజా గారు తదితరులు ఉన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.