గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన 16వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సనా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.ఇక నిన్నటి తో ఈసినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.వారం రోజులపాటు హైదరాబాద్ లోని బూత్ బంగ్లాలో జరిగిన ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇందులో నిన్న మిర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.ఈసినిమాలో తను ప్రతినాయకుడిపాత్రలో కనిపించనున్నాడు. సౌత్ లో ఇదే తనకు మొదటి సినిమా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మూడో షెడ్యూల్ మార్చి మొదటి వారంలో స్టార్ట్ అవుతుందని సమాచారం.రూరల్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈసినిమాలో రామ్ చరణ్ సరికొత్త లుక్ లో కనిపించనుండగా తనకు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుంది.కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ,వృద్ధి సినిమాస్ ,సుకుమార్ రైటింగ్స్ ఈసినిమాను నిర్మిస్తున్నాయి.కుదిరితే ఈఏడాది చివర్లో రిలీజ్ చేసే ప్లాన్ లో వున్నారు.
ఇక ఈసినిమా తరవాత రామ్ చరణ్ ,సుకుమార్ డైరెక్షన్ లో నటించనున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది.ఈఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. రామ్ చరణ్ కు తోడు పుష్ప 2 తరువాత సుకుమార్ డైరెక్ట్ చేయనున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: