హీరో విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప’. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ప్రతీ సోమవారం ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ రివీల్ చేసిన చిత్ర యూనిట్ అంతకుముందే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడి క్యారక్టర్ పోస్టర్ విడుదలచేసిన సంగతి గుర్తుండేవుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం మరో క్రేజీ అప్డేట్ ఇచ్చింది. త్వరలోనే ఈ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ రాబోతోంది. ఈ మేరకు “శ్రీశ్రీ రవిశంకర్ గురుజీ, కన్నప్ప యొక్క చాలా కాలంగా ఎదురుచూస్తున్న మొదటి సింగిల్ ‘శివ శివ శంకర’ని ఫిబ్రవరి 10వ తేదీన బెంగళూరులో ఆవిష్కరించనున్నారు! తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళంలో విడుదలవుతోంది — దివ్యమైన సంగీత అనుభూతిని పొందండి” అని ఎక్స్ వేదికగా తెలిపింది.
కాగా కన్నప్ప చిత్రంలో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషలకు చెందిన ప్రముఖ నటీనటులు నటిస్తున్న విషయం తెలిసిందే. మోహన్ బాబు, మోహన్ లాల్, మధుబాల, శరత్ కుమార్, దేవరాజ్, హీరోయిన్ ప్రీతి ముఖుంధన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే బ్రహ్మానందం, సప్తగిరి తదితరులు నటిస్తున్నారు. ఇక వీరితోపాటుగా విష్ణు మంచు కుమార్తెలు, కుమారుడు మరో ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.
మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే విజువల్ వండర్‌గా కన్నప్ప ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ధైర్యవంతుడైన యోధుడు శివుని భక్తుడైన కన్నప్ప కథను అద్భుతంగా మలుస్తున్న చిత్ర యూనిట్.. ఏప్రిల్ 25, 2025న ఈ సినిమాను రిలీజ్ చేయబోతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: