తండేల్ ఈ రోజే మంచి అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చింది.ఊహించినట్లుగానే ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ తోపాటు సూపర్ అనే మౌత్ టాక్ ను సొంతం చేసుకుంటుంది.ముఖ్యంగా లీడ్ పెయిర్ యాక్టింగ్ గురించి అలాగే సంగీతం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.విడుదలకు ముందే దేవి శ్రీ ప్రసాద్ నుండి వచ్చిన మూడు పాటలు పెద్ద హిట్ అయ్యాయి.ఒకరకంగా సినిమాను ఎక్కువగా ప్రమోట్ చేసింది సాంగ్సే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అలా విడుదలకుముందు దేవి సినిమాకు చేయాల్సిన న్యాయం చేశాడు.అయితే కేవలం సాంగ్స్ తోనే ఆగిపోలేదు దేవి.సినిమాలో ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా వున్నా సాంగ్స్ వల్ల ఎక్కడా బోర్ కొట్టలేదు.ఇక సెకండ్ హాఫ్ లో బీజీఎమ్ కట్టిపడేసింది.ముఖ్యంగా ఎమోషనల్, క్లైమాక్స్ సన్నివేశాల్లో బీజీఎమ్ అదిరిపోయింది.లవ్ స్టోరీ సినిమాలకు దేవి మంచి మ్యూజిక్ ఇస్తాడనే పేరుంది.చివరగా ఉప్పెనకు అలాంటి మ్యూజిక్ ఇవ్వగా మళ్ళీ తండేల్ తో వింటేజ్ దేవి ఈజ్ బ్యాక్ అనే కామెంట్లు చేస్తున్నారు చూసినవాళ్లు.ఓవరాల్ గా తండేల్ ను హీరో,హీరోయిన్ నటనతో ఎంగేజింగ్ చేస్తే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది.అలా ఈసినిమాకు తెర వెనుక హీరో దేవినే అని చెప్పొచ్చు.
ఇక సినిమాకు పాజిటివ్ టాక్ రావడం తో మ్యాట్నీ నుండి షోస్ హౌస్ ఫుల్ అవుతున్నాయి.దాంతో తండేల్, చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా నిలువనుంది.మొదటి రోజు డబుల్ డిజిట్ గ్రాస్ వసూళ్లను రాబట్టుకోనుంది.చందు మొండేటి ఈసినిమాను డైరెక్ట్ చేయగా గీతా ఆర్ట్స్ నిర్మించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: