గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘గేమ్ ఛేంజర్’. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ సోలో హీరోగా వచ్చిన సినిమా కావడం, దీనికి ప్రముఖ తమిళ్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వం వహించడంతో తొలినుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో గత నెలలో సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఈ పొలిటికల్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను బాగానే అలరించింది. రామ్ చరణ్ ను సరికొత్తగా ఆవిష్కరించింది గేమ్ ఛేంజర్. సిన్సియర్ అధికారిగా, రాజకీయ పార్టీ నేతగా డ్యూయెల్ రోల్స్ లో చరణ్ అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. కేవలం చరణ్ అభిమానులకే కాకుండా మూవీ లవర్స్ అందరినీ మెప్పించింది ఈ చిత్రం.
పొంగల్ బరిలో బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టుకుంది గేమ్ ఛేంజర్. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో నేటినుంచి ఈ ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ స్ట్రీమింగ్ కి వచ్చేసింది.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో గేమ్ ఛేంజర్ అందుబాటులో ఉంది. సో, మూవీ లవర్స్ గెట్ రెడీ.. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయినవారు, అలాగే మరోసారి చూడాలనుకునేవారు ఇప్పుడు ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని వీక్షించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఇక ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటించగా.. ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, కిక్ శ్యామ్, సముద్రఖని, సునీల్, అంజలి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించగా.. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
గేమ్ ఛేంజర్ కథేంటంటే..?
రామ్ నందన్ (రామ్ చరణ్) యంగ్ ఐపీఎస్ అధికారి, కోపం చాలా ఎక్కువ. కాలేజీలో పరిచయమైన దీపిక (కియారా అద్వానీ)ని ప్రేమిస్తాడు. తనకోసం కోపాన్ని తగ్గించుకుని వ్యక్తిత్వాన్ని మార్చుకుంటాడు. తన కోరిక మేరకు ఐఏఎస్ అవుతాడు. ఈ క్రమంలో విశాఖ జిల్లాకు కలెక్టర్‌గా వస్తాడు. అదే సమయంలో ఏపీలో అభ్యుదయ అనే పార్టీ అధికారంలో ఉంటుంది.
ముఖ్యమంత్రి సత్యమూర్తి (శ్రీకాంత్) చేతిలో మరో యేడాది అధికారం ఉంటుంది. ఈ యేడాది అవినీతిని పక్కన పెట్టి, ప్రజలకు సేవ చేయాలని మంత్రుల్ని, ఎం.ఎల్.ఏలను ఆదేశిస్తాడు. అయితే సత్యమూర్తి తనయుడు మోపీదేవి (ఎస్.జె.సూర్య)కి సీఎం సీటుపై కన్ను వుంటుంది. తండ్రి ఎప్పుడు పోతాడా.. ఎప్పుడెప్పుడు సీఎం అవుదామా అని వేచి చూస్తుంటాడు.
ఈ నేపథ్యంలో మోపిదేవి అక్రమాలకు కలెక్టర్ రామ్ నందన్ అడ్డుకుని చెక్ పెడతాడు. మరోవైపు సత్యమూర్తి చనిపోతాడు. ఆయన స్థానంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టీ పెద్దలు మోపీదేవిని బలపరుస్తారు. ఇక మోపీదేవినే సీఎం అని అంతా అనుకుంటున్న తరుణంలో కథ ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. రామ్ నందన్‌కు సంబంధించిన ఓ నిజం బయటపడుతుంది.
అసలు రామ్ నందన్ ఎవరు? అభ్యుదయ పార్టీకి, అప్పన్న, పార్వతి లకు.. రామ్ నందన్‌కు ఉన్న సంబంధం ఏంటి? తనకూ సత్యమూర్తికి ఉన్న సంబంధం ఏమిటి? సీఎం పదవి దక్కించుకోవడానికి మోపిదేవి ఎలాంటి ఎత్తులు వేశాడు? తన అధికార బలాన్ని ఉపయోగించి రామ్ నందన్‌ను ఎలా అడ్డుకున్నాడు? అతడి ప్రయత్నాలను రామ్ నందన్ ఎలా చెక్ పెట్టాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: