యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ,బొమ్మరిల్లు ఫేమ్ భాస్కర్ డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా జాక్ ..కొంచెం క్రాక్ అనేది ట్యాగ్ లైన్.టిల్లు స్క్వేర్ తరువాత సిద్దు నుండి వస్తున్న సినిమా ఇది. షూటింగ్ కూడా చివరిదశకు చేరుకుంది.ఈసినిమా నుండి ఈరోజు సిద్దు బర్త్ డే సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఇక ఈ టీజర్ ఇంట్రెస్టింగ్ గా వుంది. టీజర్ లో సిద్దు రోల్ ను మాత్రం రివీల్ చేయలేదు.అదే సినిమాకు ఇంట్రెస్ట్ గా మారనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాలో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తుండగా అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.జాక్ ఏప్రిల్ 10న విడుదలకానుంది.
ఇక ఈసినిమాతో పాటు సిద్దు ప్రస్తుతం తెలుసు కదా అనే సినిమా కూడా చేస్తున్నాడు.నీరజ కోన డైరెక్ట్ చేస్తుండగా రాశి ఖన్నా , శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.తమన్ సంగీతం అందిస్తున్నాడు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.ఈసినిమా కూడా ఈ ఏడాదే విడుదలకానుంది.
ఇక ఇదిలావుంటే గత ఏడాది టిల్లు స్క్వేర్ తో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు సిద్దు.ఈసినిమాతో మొదటి సారి 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.టిల్లు, టిల్లు స్క్వేర్ తో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకోవడం తో తన నెక్స్ట్ సినిమాలపై మంచి బజ్ వుంది. మరి జాక్ తో సిద్దు జొన్నలగడ్డ హ్యాట్రిక్ కొడతాడో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: