‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైలా’. రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మూవీ ప్రమోషన్స్ ముమ్మురం చేసారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనిలో భాగంగా ఈ చిత్రం నుంచి ఇప్పటికే మూడు పాటలు, టీజర్ రిలీజ్ చేయగా.. వీటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేసారు మేకర్స్. ట్రైలర్ అయితే హిలేరియస్‌గా ఉంది. లేడీ గెటప్‌లో విశ్వక్ నిజంగా అమ్మాయేమో అనేలా కనిపించి ఆశ్చర్యపరిచాడు. ఈ క్యారక్టర్‌లో తన నటన కూడా చాలా బావుంది. ఆకాంక్ష శర్మతో విశ్వక్ కెమిస్ట్రీ వర్కవుట్ అయిందనిపించింది.
ఇక ఈ సినిమాలో విశ్వక్ లేడీ గెటప్‌లో కనిపిస్తుండటం విశేషం. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌కి టెరిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇక విశ్వక్ లాస్ట్ రెండు సినిమాలు అనుకున్నంతగా రిజల్ట్ ఇవ్వలేకపోయాయి. దాంతో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌లో నిర్మితమవుతున్న ఈ మూవీతో ఎలాగైనా గట్టిగా కొట్టాలని భావిస్తున్నాడు.
ఇదిలావుంటే విశ్వక్ దీని తరువాత ‘ఫంకీ’ అనే చిత్రంలో నటించనునున్నాడు. ‘జాతి రత్నాలు’ ఫేమ్ కెవి అనుదీప్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనుండగా.. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నాడు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ శ్రీకర స్టూడియోస్, ఫార్ట్యూన్ఫ్ ఫోర్ సినిమాస్ ఈ సినిమాను నిర్మించనున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: