యంగ్ హీరో విశ్వక్ సేన్ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా లైలా.వచ్చే వారంలో థియేటర్లలోకి రానుంది.ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు.అందులో భాగంగా హైదరాబాద్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు.దీనికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రానున్నారు.ఈరోజు హీరో విశ్వక్ అలాగే నిర్మాత సాహు గారపాటి,చిరంజీవి నివాసానికి వెళ్లి ఆయనను ఆహ్వానించారు.ఈనెల 9న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నిన్న విడుదలైన లైలా ట్రైలర్ యూట్యూబ్ లో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. 24గంటల్లో ఈ ట్రైలర్ 4మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. యూత్ ను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈసినిమాలో విశ్వక్ లేడీ గెటప్ లో కూడా కనిపించనున్నాడు.ఇలా ఎందుకు కనిపించాల్సి వచ్చిందో ట్రైలర్ లో రివీల్ చేశారు.
రామ్ నారాయణ్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించింది.లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్స్ నిర్మిస్తుంది. ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
ఇక ఈసినిమా విజయం విశ్వక్ సేన్ కు తప్పనిసరి కానుంది. గత ఏడాది విశ్వక్ మూడు సినిమాలతో ప్రేక్షకులముందుకు రాగ అందులో ఒకటి సూపర్ హిట్ అయ్యింది. మిగితా రెండు నిరాశపరిచాయి.దాంతో లైలాతో కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు.ఈసినిమా విజయంపై విశ్వక్ ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: