‘నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా, బొమ్మరిల్లు’ సినిమాలతో తెలుగులో స్టార్‌డమ్ అందుకున్న హీరో సిద్ధార్థ్. అయితే ఆ తర్వాత ఆయన నటించిన చిత్రాలేవీ చెప్పుకోదగ్గ హిట్ కాలేదు. దీంతో సిద్ధార్థ్ తన మాతృభాష తమిళంలోనే వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే అక్కడ హిట్ అయిన కొన్ని చిత్రాలను తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కెరీర్ తొలినాళ్లలో లవర్ బాయ్ తరహా పాత్రలు పోషించిన సిద్దు, ఆ తర్వాత కంటెంట్ ప్రధానంగా మూవీస్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన హీరోగా ఓ డిఫరెంట్ ఫిల్మ్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు శ్రీ గణేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
కాగా ఈ చిత్రానికి ‘3BHK’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు. దీన్నిబట్టి ఈ సినిమాను మధ్యతరగతి కుటుంబం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మూవీ ఫస్ట్ లుక్ గమనిస్తే.. సాధారణ ఉద్యోగి అయిన ఓ తండ్రి, ఇంటిపనులు చూసుకునే గృహిణి అయిన తల్లి, వారి కొడుకు, కూతురు.. ఈ థీమ్ కనిపిస్తోంది.
ఇక ఈ 3BHK సినిమాలో తండ్రి పాత్రలో శరత్ కుమార్, తల్లిగా సీనియర్ నటి దేవయాని నటిస్తుండగా.. కొడుకుగా సిద్దార్థ్, కూతురుగా మీతా రఘునాథ్ కనిపించనున్నారు. అలాగే చైత్ర, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు అమ్రిత్ రామ్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. అరుణ్ విశ్వ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్‌లో రిలీజ్ చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: