గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ ఇటీవలే ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా ఆయన సెన్సిబుల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని చేస్తున్న ఇషయం తెలిసిందే. ‘RC16’ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోన్న ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో RC16 సెట్స్‌లోకి బుధవారం ఓ స్పెషల్ గెస్ట్ విచ్చేసారు. ఈ విషయం చరణే స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలియజేశారు. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో కూడా తెలుపుతూ ఓ ఫొటోని షేర్ చేశారు. ప్రస్తుతం రామ్ చరణ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
అయితే ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు.. మెగా ప్రిన్సెస్ ‘క్లిన్ కారా’. అవును రామ్ చరణ్, ఉపాసనల ముద్దుల తనయ. ఈ సందర్భంగా క్లిన్ కారాను ఎత్తుకుని ఉన్న ఫొటోని షేర్ చేసి.. ‘RC16 సెట్స్‌లోకి ఓ స్పెషల్ గెస్ట్ వచ్చారు’ అంటూ పోస్ట్ చేశారు. దీనిపై మెగా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తూ మెగా ప్రిన్సెస్‌కు వెల్‌కమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఎప్పటిమాదిరే రామ్ చరణ్ షేర్ చేసిన ఫొటోలో క్లిన్ కారా ఫేస్‌ని రివీల్ చేయలేదు. ఇప్పటివరకూ చరణ్, ఉపాసన దంపతులు క్లిన్ కారా ముఖాన్ని బహిర్గతపరచలేదన్న సంగతి అందరికీ తెలిసిందే. తమ బిడ్డ ప్రైవసీకి భంగం కలిగించకూడదని వారు భావించడమే ఇందుకు కారణం. కానీ, ఇటీవల చరణ్ ఒక కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ.. అతి త్వరలోనే క్లిన్ కారా ఫేస్‌ను రివీల్ చేస్తామని చెప్పడం గమనార్హం.
కాగా RC16లో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. అలాగే ‘కరుణడ చక్రవర్తి’ శివరాజ్ కుమార్, జగపతిబాబు, ‘మీర్జాపూర్’ ఫేమ్ దివ్యేందు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ‘ఉప్పెన’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: