సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది సంక్రాంతికి వస్తున్నాం.ఏకంగా 300కోట్ల గ్రాస్ మార్క్ ను దాటి ఆల్ టైం రీజినల్ ఇండస్ట్రీ హిట్ గా రికార్డు సృష్టించింది.ఈ సినిమాతో నేటితో 25డేస్ రన్ పూర్తి చేసుకోనుంది.ఫ్యామిలీ ఆడియన్స్ నుండి ఈసినిమాకు సూపర్ సపోర్ట్ లభించింది. ఇక సంక్రాంతికి వస్తున్నాం ఓటిటి డీల్ కూడా పూర్తయినట్లు సమాచారం.డిజిటల్ హక్కులను జీ 5 దక్కించుకోగా శాటిలైట్ హక్కులు జీ తెలుగు సొంతం చేసుకున్నాయి.ఈ రెండు హక్కులు భారీ ధర పలికాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే సంక్రాంతికి వస్తున్నాం ఇప్పుడపుడే ఓటిటిలోకి వచ్చేలా కనిపించడం లేదు.థియేటర్లలో ఇంకా మంచి రన్ కొనసాగిస్తుండడం తో మార్చి మొదటి వారంలో స్ట్రీమింగ్ లోకి తీసుకురావాలని చూస్తుంది జీ 5.అనిల్ రావిపూడి డైరెక్షన్ లో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమాలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించగా ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు.దిల్ రాజు ,శిరీష్ ఈసినిమాను నిర్మించారు.
ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.అయితే ఈ సీక్వెల్ ఆలస్యం కావొచ్చు.ఎందుకంటే అనిల్ రావిపూడి నెక్స్ట్ మెగా స్టార్ చిరంజీవితో సినిమా చేసే ప్రయత్నాల్లో వున్నారు.దాంతో సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ వచ్చే ఏడాది వుండే అవకాశం వుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: