కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Telugu Trailers 2023

ట్యాగ్ · 17 కథనాలు

changure bangaru raja movie trailer released
ట్రైలర్ & టీజర్

ఛాంగురే బంగారురాజా ట్రైలర్ రిలీజ్

సతీష్ వర్మ దర్శకత్వంలో కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ కార్తీక్ రత్నం, ఖుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా ఛాంగురే బంగారురాజా. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. సెప్టెంబర్ 15వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మాస్ మహారాజా ఈసినిమా ట్రైలర్ ను తన సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయడం జరిగింది.

TFN Adminవాట్సాప్
peddha kapu 1 movie trailer released
ట్రైలర్ & టీజర్

పెదకాపు-1 ట్రైలర్ రిలీజ్

కంటెంట్ బేస్డ్ సినిమాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. దానికి నిదర్శనమే రీసెంట్ గా బలగం సినిమాకు వచ్చిన రెస్పాన్స్ అని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు అదే కంటెంట్ బెేస్డ్ తో వస్తున్న సినిమా పెదకాపు. ఒకప్పుడు ఫ్యామిలీ ఎంటర్ టైనర్లను తీసి మంచి పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాల నారప్ప సినిమాతో తన రూటు మార్చాడు. వెంకీతో నారప్ప సినిమాను తీసి హిట్ కొట్టిన శ్రీకాంత్ అడ్డాల ఇప్పుడు పెదకాపు అంటూ వచ్చేస్తున్నాడు. విరాట్ కర్ణ హీరోగా వస్తున్న ఈసినిమా రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండగా అందులో మొదటి పార్ట్ ఈనెల 29వ తేదీన రిలీజ్ కాబోతుంది.

TFN Adminవాట్సాప్
Rules Ranjann movie trailer out now
ట్రైలర్ & టీజర్

రూల్స్ రంజన్ ట్రైలర్ రిలీజ్

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఈరేంజ్ లో అవకాశాలు అందుకోవడం అంటే మాములు విషయం కాదు. కిరణ్ మాత్రం ఆ విషయంలో లక్కీ అనే చెప్పొచ్చు. జయాపజయాలతో సంబంధం లేకుండా కిరణ్ కు పెద్ద పెద్ద బ్యానర్లలోనే అవకాశాలు వస్తున్నాయి. ఇక ఈ ఏడాది ఇప్పటికే వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్ ఇప్పుడు మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Sachin Tendulkar Unveils The Trailer of Muttiah Muralitharan's Biopic 800 Movie
ట్రైలర్ & టీజర్

సచిన్ చేతుల మీదుగా.. '800' మూవీ ట్రైలర్ విడుదల

టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా '800'. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ దీనిని నిర్మిస్తోంది. మురళీధరన్ పాత్రలో 'స్లమ్‌డాగ్ మిలియనీర్' ఫేమ్ మధుర్ మిట్టల్, మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. బుకర్ ప్రైజ్ (2022) పురస్కార గ్రహీత షెహన్ కరుణతిలకతో కలిసి ఆయన స్క్రిప్ట్ అందించారు. మధుర్ మిట్టల్, మహిమా నంబియార్, నరెన్, నాజర్, వేల్ రామమూర్తి, రిత్విక, వడివుక్కరసి, అరుల్ దాస్, హరి కృష్ణన్, శరత్ లోహితశ్వ తదితరులు నటించారు. ఇక ఈ చిత్రానికి ప్రవీణ్ కెఎల్ ఎడిటర్ కాగా…

Srikanth Mవాట్సాప్
jawan trailer out now
ట్రైలర్ & టీజర్

జవాన్ ట్రైలర్ రిలీజ్

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటించిన జవాన్ మరో వారం రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు ఈసినిమా ట్రైలర్ ను విడుదలచేశారు.ఇక ఈ ట్రైలర్ చూస్తే జవాన్,షారుఖ్ కు మరో హిట్ ఇచ్చేలానే ఉంది.ముఖ్యంగా విజువల్స్,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ లో హైలైట్ అయ్యాయి.ఈసినిమాలో షారుఖ్ డిఫ్రెంట్ షేడ్స్ లో కనిపించనున్నాడు.

Mahender Reddyవాట్సాప్
kushi trailer gets super response
ట్రైలర్ & టీజర్

ఖుషి ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్

విజయ్ దేవరకొండ,సమంత కలిసి నటించిన ఖుషి మరో మూడు వారాల్లో థియేటర్లోకి రానుంది.పోస్టర్లు ,సాంగ్స్ సినిమాఫై హైప్ క్రీయేట్ చేయగా నిన్న విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచింది.యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడంతో ఖుషి,విజయ్ కి కావాల్సిన విజయాన్ని అందిస్తుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.ఇక ఈట్రైలర్ 24గంటల్లో కోటికి పైగా వ్యూస్ ను రాబట్టుకుంది.

Mahender Reddyవాట్సాప్
kushi trailer out now
ట్రైలర్ & టీజర్

ఖుషి ట్రైలర్ రిలీజ్

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఖుషి ట్రైలర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది.రీసెంట్ గా విడుదలైన సాంగ్స్ అన్ని సూపర్ హిట్ కావడంతో సినిమాఫై హైప్ క్రియేట్ చేయగా తాజాగా విడుదలైన ట్రైలర్ అంచనాలకు తగ్గట్లుగా వుంది.విప్లవ్,ఆరాధ్యల ప్రేమ ఆతరువాత వారి వైవాహిక జీవితం చుట్టూ తిరిగే కథతో వస్తుంది ఖుషి.విప్లవ్ పాత్రలో విజయ్ దేవరకొండ,ఆరాధ్య పాత్రలో సమంత నటించారు.వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాలో హైలైట్ కానుంది.ట్రైలర్ లో మాత్రం విజయ్,సమంత ల లుక్ అదిరిపోయింది.విజువల్స్ చాలా బాగున్నాయి.ట్రైలర్ చూస్తుంటే ఈసినిమాతో సాలిడ్ హిట్ కొట్టి విజయ్ మళ్ళీ ట్రాక్ లోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది.

Mahender Reddyవాట్సాప్
santosh shoban prem kumar movie trailer out now
ట్రైలర్ & టీజర్

ప్రేమ్ కుమార్ ట్రైలర్ రిలీజ్

గోల్కొండ స్కూల్ సినిమాలో బాలనటుడిగా నటించి పేపర్ బాయ్ సినిమాతో హీరోగా పరిచయమైన యంగ్ హీరో సంతోష్ శోభన్. ఇక అప్పటినుండీ హీరోగా తనను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు సంతోష్ శోభన్. నిజానికి సంతోష్ శోభన్ ఎన్ని సినిమాలు చేస్తున్నా పెద్దగా సక్సెస్ ను అందుకోలేకపోతున్నాడు. ఆమధ్య ఏక్ మినీ కథ సినిమాతో ఒక హిట్ ను అందుకున్నాడు. ఆ తర్వాత నుండి మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడు మరోకథతో వస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Naa Nee Premakatha Trailer out now
ట్రైలర్ & టీజర్

నా.. నీ ప్రేమ కథ ట్రైలర్ రిలీజ్

అముద శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో తానే హీరోగా వస్తున్న సినమా ‘నా.. నీ ప్రేమ కథ’. ప్రేమకథగా రాబోతున్న ఈసినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే రీసెంట్ గానే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ఈసినిమా ట్రైలర్ ని లాంచ్ చేశారు.

TFN Adminవాట్సాప్
7.11 movie trailer out
ట్రైలర్ & టీజర్

ఆద్యంతం ఆసక్తికరంగా 7.11PM ట్రైలర్

ఈమధ్య కంటెంట్ ఉంటే చాలా చిన్న సినిమా కూడా పెద్ద సక్సెస్ అవుతుంది. ఆడియన్స్ ను తమ కథతో ఎంగేజ్ చేస్తే చాలు సినిమా హిట్టే. అలా చిన్నసినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టిన సినిమాలను చాాలానే చూశాం. ఇప్పుడు అలాంటి ఓ చిన్న సినిమానే థియేటర్లలో సందడి చేయడానికి వచ్చేస్తుంది. చైతు మాదాల దర్శకత్వంలో సాహస్, దీపికా హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా 7:11 PM. ఈసినిమా సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‏తో రూపొందుతుంది. అందుకే ఈసినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

TFN Adminవాట్సాప్
naga shauryas rangabali movie trailer out
ట్రైలర్ & టీజర్

రంగబలి ట్రైలర్ రిలీజ్

టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల్లో నాగశౌర్య కూడా ఇప్పుడు తన రూట్ ను మార్చి డిఫరెంట్ కథలను చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అందుకే హిట్స్ ఫ్లాప్స్ ను పట్టించుకోకుండా ప్రయోగాలు చేయడానికే ముందుకొస్తున్నాడు. ప్రస్తుతం నాగశౌర్య మరో కొత్త సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయాడు. నాగశౌర్య హీరోగా పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో వస్తున్న సినిమా రంగబలి. పల్లెటూరి నేపథ్యంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ప్రస్తుతం అయితే మేకర్స్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.

TFN Adminవాట్సాప్
vimanam movie trailer out now
ట్రైలర్ & టీజర్

విమానం ట్రైలర్ రిలీజ్-ఎమోషనల్ రైడర్

శివప్ర‌సాద్ యానాల ద‌ర్శ‌క‌త్వంలో సముద్రఖని ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా విమానం. ఈసినిమాలో సముద్రఖని దివ్యాంగుడిగా నటిస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక జూన్ 9వ ఈసినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను చిన్నగా మొదలుపెట్టారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

TFN Adminవాట్సాప్
nenu student sir movie trailer out now
ట్రైలర్ & టీజర్

నేను స్టూడెంట్ సర్ ట్రైలర్ రిలీజ్

డెబ్యూ మూవీ అందులో హీరో ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండాలని అనుకుంటారు హీరోలు. కానీ అలాంటి ఎలిమెంట్స్ ఏవీ లేకుండా స్వాతిముత్యం అనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో వచ్చి ఆకట్టుకున్నాడు బెల్లంకొండ గణేష్. మొదటి సినిమాలోనే తన సెటిల్డ్ నటనతో అందరినీ ఆకట్టుకొని డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు రెండో సినిమా వస్తున్నాడు. రాకీ ఉప్పలపాటి దర్శకత్వంలో బెల్లంకొండ గణేష్ హీరోగా వస్తున్న సినిమా నేను స్టూడెంట్ సర్. ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ అనుకోని కారణాల వల్ల రిలీజ్ ఆలస్యమవుతూ వచ్చింది. దీంతో రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో…

TFN Adminవాట్సాప్
sunil bhuvana vijayam movie trailer out
ట్రైలర్ & టీజర్

భువన విజయమ్ ట్రైలర్ రిలీజ్

కమెడియన్, హీరో అయిన సునీల్ ఇప్పుడు మరోసారి ప్రధానపాత్రలో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. భువన విజయమ్ అనే టైటిల్ తో వస్తున్న ఈసినిమాకు యలమంద చరణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈసినిమా మే 12వ తేదీన రిలీజ్ కాబోతుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

TFN Adminవాట్సాప్
allari naresh ugram movie trailer out now
ట్రైలర్ & టీజర్

ఉగ్రం ట్రైలర్ రిలీజ్

కెరీర్ ప్రారంభం నుండి తన కామెడీ సినిమాలతో ప్రేక్షకులను కితకితలు పెట్టించిన అల్లరి నరేష్ ఇప్పుడు తన రూట్ ను మార్చాడు. ఇక చాలా కాలం గ్యాప్ తీసుకొని నాంది సినిమాతో మంచి కమ్ బ్యాక్ ను అందుకున్నాడు. ప్రస్తుతం విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఉగ్రం అనే సినిమాతో వస్తున్నాడు. నాంది సినిమా తరువాత వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా ఇది. ఆ సినిమా సక్సెస్‌తో మరోసారి వీరిద్దరూ ఇప్పుడు ఉగ్రం సినిమా కోసం చేతులు కలిపారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా వస్తున్నట్టు ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ను బట్టి అర్థమైంది. ఇకఈ సినిమా మే 5న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో వరుస అప్‌డేట్‌లు ప్రకటిస్తూ సినిమాపై ఆసక్తిని…

TFN Adminవాట్సాప్
ramabanam movie trailer out now
ట్రైలర్ & టీజర్

రామబాణం ట్రైలర్ రిలీజ్..యాక్షన్ ప్లస్ ఎమోషన్

యాక్షన్ హీరో గోపీచంద్ మాత్రం సరైన హిట్ కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. తను సాలిడ్ హిట్ కొట్టి చాలాకాలమే అయిపోయింది. మధ్యలో కొన్ని సినిమాలు పర్వాలేదు అనిపించాయి కానీ కమర్షియల్ గా మాత్రం సక్సెస్ కాలేదు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా రామబాణం. శ్రీవాస్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా మే 5 వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచింది. ఈనేపథ్యంలోనే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, పాటలు అన్నీ ఆకట్టుకున్నాయి.

TFN Adminవాట్సాప్
Kiran Abbavarams Meter Movie Trailer Out Now
ట్రైలర్ & టీజర్

యాక్షన్ ప్యాక్డ్ గా మీటర్ ట్రైలర్

వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. రీసెంట్ గానే వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్ ఈ సినిమాతో హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. రమేశ్ కాడూరి దర్శకత్వంలో కిరణ్ హీరోగా వస్తున్న సినిమా మీటర్. ఈ సినిమాలో కిరణ్ తొలిసారి ఓ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ఆ అంచనాలను మరింత పెంచేశాయి.

TFN Adminవాట్సాప్

షేర్