కమెడియన్, హీరో అయిన సునీల్ ఇప్పుడు మరోసారి ప్రధానపాత్రలో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. భువన విజయమ్ అనే టైటిల్ తో వస్తున్న ఈసినిమాకు యలమంద చరణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈసినిమా మే 12వ తేదీన రిలీజ్ కాబోతుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది. ట్రైలర్ లో కథాంశం ఏంటో తెలిపారు మేకర్స్. ఒక వ్యక్తిని యమలోకంలోకి తీసుకెళ్లడానికి ఇద్దరు యమ భటులు వస్తారు.. అయితే అతను ఒక సినిమా ఆఫీస్ కు వెళ్లడం.. అక్కడ వెళ్లిన యమభటులకు అక్కడ కూడా వేరే వ్యక్తి చనిపోబోతున్నాడని.. ఇద్దరినీ కలిసి ఒకేసారి తీసుకెళ్లొచ్చని అనుకుంటారు. అప్పుడు ప్రధాన పాత్రలు ఒక్కొక్కటి తెరపైకి రావడం వారి మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. కథ అవుట్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా అనిపిస్తున్న ఈసినిమాలో ఫన్ తో పాటు సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాాయి. ట్రైలర్ అయితే సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. మరి సునీల్ కు ఈసినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
Crime Comedy – Thriller that rides on Some fabulous Performances 💫#BhuvanaVijayamTrailer is out Now ✨
▶️ : https://t.co/VoJ85e1Kv0#BhuvanaVijayamOnMay12th✅@suneeltollywood @vennelakishore @harshachemudu @DhanrajOffl #YalamandaCharan @mirthhimalaya @adityamusic pic.twitter.com/a6tl1tZ5Pa
— Mirth Media & Himalaya Studio Mansions (@mirthhimalaya) May 2, 2023
కాగా ఈసినిమాలో ఇంకా పృథ్విరాజ్, గోపరాజు రమణ, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనురాజ్, జబర్ధస్త్ రాఘవ, షేకింగ్ శేషు, కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీమతి లక్ష్మి సమర్పణలో హిమాలయ స్టూడియో మ్యాన్షన్స్ బ్యానర్‌పై కిరణ్, వీఎస్‌కే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈసినిమాకు సాయి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఛోటా కే ప్రసాద్ ఎడిటర్ గా చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: