యాక్షన్ ప్యాక్డ్ గా మీటర్ ట్రైలర్

Kiran Abbavarams Meter Movie Trailer Out Now

వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. రీసెంట్ గానే వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్ ఈ సినిమాతో హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. రమేశ్ కాడూరి దర్శకత్వంలో కిరణ్ హీరోగా వస్తున్న సినిమా మీటర్. ఈ సినిమాలో కిరణ్ తొలిసారి ఓ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ఆ అంచనాలను మరింత పెంచేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ ఫుల్ యాక్షన్ ప్యాక్ట్ గా ఉండి ఆకట్టుకుంటుంది. ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండానే పోలీస్ ఆఫీసర్ గా పని చేసే కిరణ్.. ఆ తరువాత పరిస్థితుల అనంతరం డ్యూటీ మీద పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి సీరియస్ గా తీసుకుంటాడు. విజువల్స్ గ్రాండ్‌గా ఉన్నాయి. సాయి కార్తీక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే మీటర్’ సినిమాతో కిరణ్ మరో హిట్టు అందుకోవడం ఖాయమని అర్థమవుతోంది.

కాగా ఈసినిమాలో అతుల్య రవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో అతుల్య రవి కథానాయికగా తెలుగు తెరకి పరిచయమవుతోంది. 2017లోనే కోలీవుడ్ కి పరిచయమైన అతుల్య ఈ సినిమాతో ఇక్కడ ఎన్ని మార్కులు కొట్టేస్తుందనేది చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. సాయికార్తీక్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈసినిమాతో కిరణ్ అబ్బవరం ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =