ఈమధ్య కంటెంట్ ఉంటే చాలా చిన్న సినిమా కూడా పెద్ద సక్సెస్ అవుతుంది. ఆడియన్స్ ను తమ కథతో ఎంగేజ్ చేస్తే చాలు సినిమా హిట్టే. అలా చిన్నసినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టిన సినిమాలను చాాలానే చూశాం. ఇప్పుడు అలాంటి ఓ చిన్న సినిమానే థియేటర్లలో సందడి చేయడానికి వచ్చేస్తుంది. చైతు మాదాల దర్శకత్వంలో సాహస్, దీపికా హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా 7:11 PM. ఈసినిమా సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో రూపొందుతుంది. అందుకే ఈసినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిజానికి ఈసినిమాను ముందు జూన్ 30వ తేదీన రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు. అయితే తర్వాత మళ్లీ రిలీజ్ డేట్ ను మారుస్తూ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈసినిమా అయితే ఫైనల్ గా జులై 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ కు ఎన్నో రోజులు లేకపోవడంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలపై ఫోకస్ పెట్టింది. ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. డైరెక్టర్ హరీశ్ శంకర్ ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ అయితే సినిమా క్యూరియాసిటీని మరింత పెంచుతుంది. ట్రైలర్ ను బట్టి ఒక్కరాత్రిలో ఇండియా నుంచి ఆస్ట్రేలియా ఎలా వెళ్లాడు ?.. అసలు ఆ బస్సులో ఏం జరిగింది?.. మధ్యలో టైమ్ ట్రావెల్ ఎందుకు వచ్చింది ? అనేది కథ. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ తో ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: