రంగబలి ట్రైలర్ రిలీజ్

naga shauryas rangabali movie trailer out

టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల్లో నాగశౌర్య కూడా ఇప్పుడు తన రూట్ ను మార్చి డిఫరెంట్ కథలను చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అందుకే హిట్స్ ఫ్లాప్స్ ను పట్టించుకోకుండా ప్రయోగాలు చేయడానికే ముందుకొస్తున్నాడు. ప్రస్తుతం నాగశౌర్య మరో కొత్త సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయాడు. నాగశౌర్య హీరోగా పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో వస్తున్న సినిమా రంగబలి. పల్లెటూరి నేపథ్యంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ప్రస్తుతం అయితే మేకర్స్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగాా టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. లవ్, యాక్షన్, కామెడీతో కూడిన సీన్స్ పై కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. నాగశౌర్య మరోసారి తనలోని కామెడీ యాంగిల్ ను బయటకు తీసుకొచ్చాడు. ముఖ్యంగా నాగ శౌర్య పంచ్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు తన పాత్రే సినిమాకు ప్రధానబలంగా నిలిచేలా కనిపిస్తుంది. సొంత షాపు నుంచే దొంగ‌త‌నం చేయ‌డం, ఫ్రెండ్స్ తో స‌రదాగా తిర‌గ‌డం, అమ్మాయిల వెంట ప‌డ‌టం ఇలా నాగశౌర్య పాత్ర ఆసక్తికరంగా ఉంది. ఇంకా సత్య కామెడీ కూడా నవ్వులు తెప్పిస్తుంది. విలన్ గా షైన్ టామ్ చాకో మార్క్ చూపించారు. ట్రైలర్ తో సినిమాపై అంచనాలు అయితే పెంచేశాడు. చూస్తుంటే ఈ సారి సూపర్ హిట్ ను కొట్టే అవకాశం ఉంది.

కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా యుక్తి తరేజా నటిస్తుంది. శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప‌వ‌న్ సీహెచ్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా దివాకర్ మణి పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 17 =