డెబ్యూ మూవీ అందులో హీరో ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండాలని అనుకుంటారు హీరోలు. కానీ అలాంటి ఎలిమెంట్స్ ఏవీ లేకుండా స్వాతిముత్యం అనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో వచ్చి ఆకట్టుకున్నాడు బెల్లంకొండ గణేష్. మొదటి సినిమాలోనే తన సెటిల్డ్ నటనతో అందరినీ ఆకట్టుకొని డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు రెండో సినిమా వస్తున్నాడు. రాకీ ఉప్పలపాటి దర్శకత్వంలో బెల్లంకొండ గణేష్ హీరోగా వస్తున్న సినిమా నేను స్టూడెంట్ సర్. ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ అనుకోని కారణాల వల్ల రిలీజ్ ఆలస్యమవుతూ వచ్చింది. దీంతో రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ మళ్లీ ప్రమోషన్స్ లో జోరు పెంచింది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, పాటలు, పలు పోస్టర్లు రిలీజ్ వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది. గణేష్ ఈసినిమాలో స్టూడెంట్ గా కనిపిస్తున్నాడు. ఇక ఐఫోన్ అంటే ఎంతో ఇష్టం ఉన్న హీరో ఐఫోన్ కొనుక్కోవడం.. అనంతరం ఓ మర్డర్ కేసులో ఇరుక్కోవడం.. తన అకౌంట్ లో కోటి రూపాయలకు పైగా క్రెడిట్ అవ్వడం.. దీంతో పోలీసుల వల్ల ఇబ్బందులు ఈసినిమా ట్రైలర్ లో చూపించారు. పోలీస్ అధికారి పాత్రలో సముద్రఖని నటన కూడా సినిమాకు హైలెట్ గా నిలవనున్నట్టు అర్థమవుతుంది. ట్రైలర్ చూస్తుంటే కంటెంట్ ఉన్న సినిమాగా అనిపిస్తుంది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో వస్తున్నట్టు అర్థమవుతుంది రాఖీ. ట్రైలర్ అయితే సినిమా అంచనాలు పెంచేసింది.. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: