
ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 224


సలార్ సక్సెస్ సెలబ్రేషన్స్.. టీమ్ సందడి

గుంటూరు కారం ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్

ఉపేంద్ర UI సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్

దిల్ రాజు చేతికి అయలాన్

దేవర పవర్ ఫుల్ గ్లింప్స్ రిలీజ్

ఇండియన్ 2 కోసం స్పెషల్ విఎఫ్ఎక్స్ టీమ్

షూటింగ్ పూర్తిచేసుకున్న గీతాంజలి మళ్లీ వచ్చింది

ఓజి చేతులు మారనుందా ...క్లారిటీ ఇచ్చేశారు

నా సామిరంగ ట్రైలర్ రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్

మాస్ తో అదరగొట్టిన గుంటూరు కారం ట్రైలర్

సక్సెస్ ఫుల్ గా సెకండ్ వీక్ లోకి డెవిల్

దేవర గ్లింప్స్ రిలీజ్ కు టైం ఫిక్స్

తండేల్ గ్లింప్స్ కు అక్కినేని ఫ్యాన్స్ ఫిదా

కెప్టెన్ మిల్లర్ ట్రైలర్ రిలీజ్

ఘనంగా ప్రారంభమైన నారా రోహిత్ 20వ చిత్రం

హైద్రాబాద్ లో మొదలైన గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్
లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్నసినిమా గేమ్ ఛేంజర్. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్‌లో వస్తోన్న ఈసినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒకటి గ్రామీణ పాత్రలో మరొకటి ఐఏఎస్ పాత్రలో నటించబోతున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే చాలావరకూ షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ కు సంబంధించి మరో వార్త వినిపిస్తుంది. ఈసినిమా కొత్త షెడ్యూల్ నేడు హైద్రాబాద్ లో మొదలైనట్టు తెలుస్తుంది. ఈ షెడ్యూల్ లో చరణ్ తో పాటు పలువురు కీలక నటీనటులు కూడా పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు జనవరి 22వ తేదీ వరకూ ఈ షెడ్యూల్ జరగనున్నట్టు…

సలార్ సక్సెస్ సెలబ్రేషన్స్.. టీమ్ సందడి
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా సలార్. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన ఫైనల్ డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ప్రభాస్ నటన, ప్రశాంత్ మేకింగ్, యాక్షన్ సీక్వెన్సులు ఇన్నాళ్లూ సరైన సినిమా కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించాయి. కలెక్షన్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమా 700 కోట్ల కు దగ్గరగా ఉంది. ఇక పార్ట్ 2 కూడా రాబోతుంది . పార్ట్ 2 కోసం ఇప్పటి నుండే వెయిట్ చేస్తున్నారు. సలార్ పార్ట్-2 శౌర్యాంగ…

గుంటూరు కారం ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్
మహేష్ బాబు ,త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారంఫై అంచనాలు పెరిగిపోయాయి.నిన్న రాత్రి వదిలిన ట్రైలర్ తో ఫ్యాన్స్ షూర్ షాట్ హిట్ అని ఫిక్స్ అయిపోయారు.ఇక ట్రైలర్ కు యునానిమస్ గా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.ట్రైలర్ ను ఫుల్ మాస్ గా కట్ చేశాడు త్రివిక్రమ్.మహేష్.. లుక్స్ , డైలాగ్స్ ,యాక్షన్,ఎమోషన్ ,డాన్స్ తో అల్ రౌండర్ షో చేశాడు.పండగకి పర్ఫెక్ట్ సినిమాతో వస్తున్నాడు.

ఉపేంద్ర UI సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్
డిఫరెంట్ సినిమాలు, విభిన్నమైన పాత్రలు చేయడంలో కన్నడ విలక్షణ నటుడు ఉపేంద్ర కే సాధ్యం. తను చేసే సినిమాలు అన్నీ దాదాపు విభిన్నంగానే ఉంటాయి. "ఓం", "ఏ" ,"రా" వంటి వెరైటీ టైటిల్స్ తో ప్రేక్షకులను అలరించిన ఘనత ఉపేంద్రకే దక్కుతుంది. ఇక ఇప్పుడు UI అనే టైటిల్ తో మరో డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు. ఈసినిమా మిడ్ 2000 బ్యాక్ డ్రాప్ లో రాబోతుందని ఇప్పటికే అర్థమైపోయింది. ఈసినిమా ఎప్పుడో మొదలవ్వగా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

దిల్ రాజు చేతికి అయలాన్
తమిళ హీరో శివ కార్తికేయన్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా అయలాన్.సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో భారీ విఎఫ్ఎక్స్ తో వస్తున్న ఈసినిమా తమిళంతోపాటు తెలుగులోనూ విడుదలకానుంది.హీరో,ఏలియన్ కలిసి ఏం చేశారు అనే కాన్సెప్ట్ తో తెరకెక్కింది.రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ఈసినిమాను నైజాం,ఉత్తరాంధ్ర లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదలచేయనున్నాడు.అందుకు గాను ఫ్యాన్సీ రేటు ను ఆఫర్ చేసి రిలీజ్ హక్కులు దక్కించుకున్నాడు.

దేవర పవర్ ఫుల్ గ్లింప్స్ రిలీజ్
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా దేవర. ఎన్టీఆర్ ను సిల్వర్ స్క్రీన్ పై చూసి చాలా రోజులవ్వడంతో ఫ్యాన్స్ ఈసినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో వస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకు రాబోతున్నారు. అందులో మొదటి పార్ట్ సమ్మర్ లో రాబోతుంది. ఇప్పటికే ఈసినిమా చాలా వరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఈసినిమాలో యాక్షన్ సీక్వెన్స్, అండర్ వాటర్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా నిలవనున్నాయని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

ఇండియన్ 2 కోసం స్పెషల్ విఎఫ్ఎక్స్ టీమ్
లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఇండియన్ 2. ఈసినిమా శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ అని అందరికీ తెలిసిందే. దాంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఈసినిమా ఎప్పటినుండో షూటింగ్ ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. అయితే రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ పూర్తయింది. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా గురించి మరొక ఇంట్రెస్ట్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే ఈసినిమా క్లైమాక్స్ కోసం శంకర్ ఒక స్పెషల్ విఎఫ్ఎక్స్ టీమ్ తో పనిచేస్తున్నట్టు తెలుస్తుంది.

హనుమాన్ టీమ్ గొప్ప నిర్ణయం.. ప్రతి టికెట్ పై రూ.5 విరాళం
ఆదిపురుష్ సినిమా రిలీజ్ టైమ్ లో ప్రతి థియేటర్ లో హనుమంతుడి కోసం స్పెషల్ గా సీట్ కేటాయించిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు హనుమాన్ టీమ్ కూడా మంచి నిర్ణయంతో వచ్చేసింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. పురాణాల్లోని హనుమంతుని కథ స్పూర్తితో సూపర్ హీరోస్ నేపథ్యంలో సోషియో ఫాంటసీగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఈసినిమా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సినిమాపై అంచనాలను పెంచేసింది.

షూటింగ్ పూర్తిచేసుకున్న గీతాంజలి మళ్లీ వచ్చింది
హిట్ సినిమాలకు సీక్వెల్స్ రావడం అనేది కామన్ అయిపోయింది. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో హిట్ సినిమాకు సీక్వెల్ వస్తుంది. అంజలి ప్రధాన పాత్రలో వచ్చిన కామెడీ ప్లస్ హార్రర్ మూవీ 'గీతాంజలి' సినిమా ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ వస్తుంది. ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ అనే టైటిల్ తో ఈసీక్వెల్ రానుంది. శివ తుర్లపాటి దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది.

ఓజి చేతులు మారనుందా ...క్లారిటీ ఇచ్చేశారు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సాహో ఫేమ్ సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఓజి.సుజీత్ పవన్ కు వీరాభిమాని కావడం అలాగే సినిమా గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ లో వస్తుండడంతో ఓజి అనౌన్స్ మెంట్ దగ్గరనుండి భారీ అంచనాలు మొదలయ్యాయి.మధ్యలో టీజర్ ను కూడా విడుదలచేశారు ఇక ఆ టీజర్ ఇచ్చిన హైప్ అంతా ఇంతా కాదు.అలా సినిమాపై అంచనాలు మరింత గా పెరిగిపోయాయి.వీటికి తోడు సెట్స్ మీదకు వెళ్ళనప్పటి నుండి షూటింగ్ కూడా బాగా ఫాస్ట్ గా జరగడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు.అయితే మధ్యలో బ్రేక్ రావడంతో ఇంకా సగం షూటింగ్ బ్యాలెన్స్ వుంది.

నా సామిరంగ ట్రైలర్ రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
సంక్రాంతి బరిలో పలు సినిమాలు దిగనున్న సంగతి తెలిసిందే కదా. ఇక వాటిలో నాగార్జున నటించిన నా సామిరంగ సినిమా కూడా ఒకటి. చాలా సినిమాలు పోటీలో ఉన్నా ఏమాత్రం తగ్గేది లేదంటూ వచ్చేస్తున్నాడు నాగ్ కూడా. ప్రముుఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో మాస్ ఎంటర్ టైనర్ గా వస్తుంది నా సామిరంగ. ఈసినిమా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్‌తో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ఇంట్రో వీడియోలు పాటలు,టీజర్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మాస్ తో అదరగొట్టిన గుంటూరు కారం ట్రైలర్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ అలానే లిరికల్ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా రీసెంట్ గా రిలీజ్ అయిన కుర్చీ మడతపెట్టి సాంగ్ మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతుంది.

సక్సెస్ ఫుల్ గా సెకండ్ వీక్ లోకి డెవిల్
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో అభిషేక్ నామా దర్శకత్వంలో వచ్చిన సినిమా డెవిల్. 1940 బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ స్పై థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. డిసెంబర్ 29వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమా డీసెంట్ హిట్ నే అందుకుంది. సుభాష్ చంద్రబోస్, అతని అనుచరులని బ్రిటిష్ వాళ్ళు పట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు, మరో వైపు హత్య కేసు ఛేదించడం.. ఇలా డెవిల్ సినిమా ఆద్యంతం ఆసక్తిగా సాగింది. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది.

నా సామిరంగ టైటిల్ పెట్టడానికి కారణం అదే - డైరెక్టర్ విజయ్ బిన్ని
కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యూజ్ బజ్‌ని క్రియేట్ చేస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నా సామిరంగ సంక్రాంతి కానుకగా జనవరి14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు విజయ్ బిన్ని విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాల్ని పంచుకున్నారు.

దేవర గ్లింప్స్ రిలీజ్ కు టైం ఫిక్స్
ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర గ్లింప్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ గ్లింప్స్ ఈనెల 8న విడుదలకానుందని తెలిసిందే.ఇక ఇప్పుడు టైం కూడా చెప్పేశారు.సోమవారం సాయంత్రం 4:05 గంటలకు రిలీజ్ చేయనున్నామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఈ గ్లింప్స్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు సృష్టించాలనే వుంది.ఈ గ్లింప్స్ తో సినిమా ఎలా వుండబోతుందో చెప్పనున్నారు.గ్లింప్స్ మాత్రం అదిరిపోతుందట ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా భారీ విఎఫ్ఎక్స్ తో ఈగ్లింప్స్ రానుందట.

తండేల్ గ్లింప్స్ కు అక్కినేని ఫ్యాన్స్ ఫిదా
నాగ చైతన్య ,చందు మొండేటి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా తండేల్.ఈరోజు ఎస్సెన్స్ అఫ్ తండేల్ పేరుతో గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఇక ఈ గ్లింప్స్ ఆకట్టుకుంది.చైతన్య లుక్స్ తోపాటు బీజీఎమ్ ,విజువల్స్ గ్లింప్స్ లో హైలైట్ అయ్యాయి.చైతన్య శ్రీకాకుళం స్లాంగ్ లో డైలాగ్స్ చెప్పగా దేశ భక్తిని కూడా జోడించారు.ఇక వీడియో చివర్లో హీరోయిన్ సాయి పల్లవిని కూడా చూపెట్టారు.గ్లింప్స్ చూస్తుంటే ఈసారి నాగ చైతన్య కు కావాల్సిన హిట్ వచ్చేలానే ఉంది.

నా సామిరంగ నుండి నాజర్ ఫస్ట్ లుక్ రిలీజ్
విజయ్ బన్నీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వస్తున్న సినిమా నా సామిరంగ. చాలా రోజుల తరువాత నాగార్జున మళ్లీ ఈసినిమాలో మాస్ రోల్ తో ఎంటర్ టైన్ చేయడానికి వచ్చేస్తున్నాడు. దీంతో ఈసినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈసినిమా నుండి పలు అప్ డేట్లు ఇచ్చారు మేకర్స్. వచ్చిన ప్రతి అప్ డేట్ కూడా సినిమాకు మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ఇప్పుడు ఈసినిమాలో నటిస్తున్న మరోపాత్రకు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. నాజర్ కూడా ఈసినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తుండగా తాజాగా తన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. మా పెద్దయ్యని పరిచయం చేస్తున్నాం అంటూ నాజర్ లుక్ ను రిలీజ్ చేశారు.

వెంకటేష్ గారి నుంచి అది నేర్చుకున్నాను - సైంధవ్ విలన్ నవాజుద్దీన్ సిద్ధిఖీ
విక్టరీ వెంకటేష్ 75 మైల్ స్టోన్, మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘సైంధవ్’. వెరీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల వస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్‌తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేశాయి. వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంతో తెలుగులో పరిచయం అవుతున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ విలేకర్ల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

కెప్టెన్ మిల్లర్ ట్రైలర్ రిలీజ్
అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా కెప్టెన్ మిల్లర్. 1930 - 40ల బ్రిటిష్ కాలం నాటి పీరియాడిక్ మూవీగా పుల్ యాక్షన్ తో ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈసినిమా పొంగల్ కు రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. టీజర్ అయితే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

ఘనంగా ప్రారంభమైన నారా రోహిత్ 20వ చిత్రం
టాలీవుడ్ హీరోలలో నారా రోహిత్‌ది ప్రత్యేక శైలి. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా భిన్నమైన కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలు చేస్తుంటారు. గత కొంతకాలంగా ఆయన నుంచి సినిమాలేవీ రాలేదు. అయితే ఇటీవలే ‘ప్రతినిధి 2’ తో మళ్లీ సినిమాల్లోకి కమ్‌బ్యాక్ ఇస్తున్నారు నారా రోహిత్. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మరో కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. కాగా ఇది రోహిత్‌కి 20వ చిత్రం (#NaraRohit20) కావడం విశేషం. ఈ మూవీని సందీప్ పిక్చర్ ప్యాలెస్ (ఎస్‌పీపీ) బ్యానర్‌పై సంతోష్ చిన్నపొళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళ్లి నిర్మిస్తున్నారు.