ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా దేవర. ఎన్టీఆర్ ను సిల్వర్ స్క్రీన్ పై చూసి చాలా రోజులవ్వడంతో ఫ్యాన్స్ ఈసినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో వస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకు రాబోతున్నారు. అందులో మొదటి పార్ట్ సమ్మర్ లో రాబోతుంది. ఇప్పటికే ఈసినిమా చాలా వరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఈసినిమాలో యాక్షన్ సీక్వెన్స్, అండర్ వాటర్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా నిలవనున్నాయని ఇప్పటికే వార్తలు వచ్చాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమా నుండి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది గ్లింప్స్ కోసం. జనవరి8 వ తేదీన ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. ఇక అప్పటినుండి ఈ రోజు కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. డేట్ రానే వచ్చేసింది. తాజాగా గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. గ్లింప్స్ అయితే ఓ రేంజ్ లో ఉంది. ఎన్టీఆర్ లుక్, పవర్ఫుల్ డైలాగులు, అనిరుథ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్బుతంగా ఉన్నాయి. గ్లింప్స్ చివరిలో ఈ సముద్రం చేపల కంటే కత్తుల్ని, నెత్తురిని ఎక్కువ చూసింది.. అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారు అంటూ అని వచ్చిన డైలాగ్ ఆకట్టుకుంటుంది.
The sea is full of blood.. it’s his Red Sea! 🌊
All hail! All hail the tiger!💥#DevaraGlimpse Out now – https://t.co/YFBb6Sj8ivMan of Masses #NTR’s #Devara flooding the cinemas from April 5th.@tarak9999 #KoratalaSiva #SaifAliKhan #JanhviKapoor @anirudhofficial…
— Yuvasudha Arts (@YuvasudhaArts) January 8, 2024
కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: