లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్నసినిమా గేమ్ ఛేంజర్. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈసినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒకటి గ్రామీణ పాత్రలో మరొకటి ఐఏఎస్ పాత్రలో నటించబోతున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే చాలావరకూ షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ కు సంబంధించి మరో వార్త వినిపిస్తుంది. ఈసినిమా కొత్త షెడ్యూల్ నేడు హైద్రాబాద్ లో మొదలైనట్టు తెలుస్తుంది. ఈ షెడ్యూల్ లో చరణ్ తో పాటు పలువురు కీలక నటీనటులు కూడా పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు జనవరి 22వ తేదీ వరకూ ఈ షెడ్యూల్ జరగనున్నట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు. ఈసినిమాను వచ్చే ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































