టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ అలానే లిరికల్ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా రీసెంట్ గా రిలీజ్ అయిన కుర్చీ మడతపెట్టి సాంగ్ మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది ట్రైలర్ కోసం. నిజానికి నిన్ననే ఈసినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వాలి. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దవడంతో ట్రైలర్ రిలీజ్ కూడా వాయిదా పడింది. ఫైనల్ గా ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది. మహేష్ మాస్ యాక్షన్ తో చెలరేగిపోయాడు. డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. చాలా రోజుల తరువాత వస్తున్నా ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు మహేష్. మరి ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మాత్రం రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.
Here it is.. The Theatrical trailer of #GunturKaaram 💥💥
Let’s celebrate Sankranthi in a MASSIVE way with the arrival of Reigning Super 🌟 @urstrulyMahesh 🔥🤩
Meet you all at the cinemas on JAN 12th ❤️🔥🕺#GunturKaaramOnJan12th 🌶#GunturKaaram… pic.twitter.com/kDZQOhlLFE
— Haarika & Hassine Creations (@haarikahassine) January 7, 2024
కాగా ఈసినిమాలో మహేష్ బాబు సరసన మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్న ఈసినిమాకు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























