అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా కెప్టెన్ మిల్లర్. 1930 – 40ల బ్రిటిష్ కాలం నాటి పీరియాడిక్ మూవీగా పుల్ యాక్షన్ తో ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈసినిమా పొంగల్ కు రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. టీజర్ అయితే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి చాలా రోజులుగా ఎదురుచూస్తుంది ట్రైలర్ కోసం. ఇప్పుడు ఆ ఎదురుచూపులకు బ్రేక్ వేస్తూ తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ కూడా చాలా బాగుంది. ధనుష్ యాక్షన్, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.
The Massive Action Extravaganza #CaptainMillerTrailer is here 🔥https://t.co/AxrZQfFxky
Blasting the Theatres worldwide #CaptainMiller from JANUARY 12th , 2024 💥@dhanushkraja @ArunMatheswaran @NimmaShivanna @sundeepkishan @gvprakash @priyankaamohan @dhilipaction pic.twitter.com/OhXNSmPyh7
— Sathya Jyothi Films (@SathyaJyothi) January 6, 2024
కాగా ఈసినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. సందీప్ కిషన్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై సెంథిల్ త్యాగరాజన్, ఆర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీని.. నాగూరన్ ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: