ఆదిపురుష్ సినిమా రిలీజ్ టైమ్ లో ప్రతి థియేటర్ లో హనుమంతుడి కోసం స్పెషల్ గా సీట్ కేటాయించిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు హనుమాన్ టీమ్ కూడా మంచి నిర్ణయంతో వచ్చేసింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. పురాణాల్లోని హనుమంతుని కథ స్పూర్తితో సూపర్ హీరోస్ నేపథ్యంలో సోషియో ఫాంటసీగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఈసినిమా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సినిమాపై అంచనాలను పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న నిర్వహించిన సంగతి తెలిసిందే కదా. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి అతిథిగా వచ్చారు. ఈనేపథ్యంలో చిరు ఒక ప్రకటన చేశారు. రామ మందిరం ప్రారంభోత్సవానికి నాకు కూడా ఆహ్వానం అందింది. ఈ నెల 22న రామ మందిర ప్రారంభోత్సవానికి నా కుటుంబం తో పాటు వెళ్తున్నాను. రామ మందిర ప్రారంభోత్సం వేళ హనుమాన్ చిత్ర బృందం నన్ను ఒక కీలక ప్రకటన చేయమని కోరారు. అదేంటంటే ఒక్కొక్క టికెట్ పై 5రూపాయలను అయోధ్యలోని రామ మందిర నిర్మాణానికి విరాళం అందించాలని చిత్ర యూనిట్ ప్రకటించారు. ఇక హనుమాన్ టీమ్ తీసుకున్న నిర్ణయంపై చిరంజీవితో పాటు అందరూ అభినందిస్తున్నారు.
Team #HANUMAN pledges to offer ₹5 for Ayodhya Rama Mandir from every ticket the audience buy in Theaters ❤️🙏
This graceful gesture is revealed by Mega 🌟 @KChiruTweets in Today’s ‘Celebrating HanuMan Pre-Release Utsav’ 😍
Watch His FULL SPEECH Here – https://t.co/AgK23ZMM7C… pic.twitter.com/3gC6hUqnOz
— Telugu FilmNagar (@telugufilmnagar) January 7, 2024
కాగా ఈసినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కీ ప్రాధాన్యం ఉంది. ఈసినిమాను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: