విజయ్ బన్నీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వస్తున్న సినిమా నా సామిరంగ. చాలా రోజుల తరువాత నాగార్జున మళ్లీ ఈసినిమాలో మాస్ రోల్ తో ఎంటర్ టైన్ చేయడానికి వచ్చేస్తున్నాడు. దీంతో ఈసినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈసినిమా నుండి పలు అప్ డేట్లు ఇచ్చారు మేకర్స్. వచ్చిన ప్రతి అప్ డేట్ కూడా సినిమాకు మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ఇప్పుడు ఈసినిమాలో నటిస్తున్న మరోపాత్రకు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. నాజర్ కూడా ఈసినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తుండగా తాజాగా తన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. మా పెద్దయ్యని పరిచయం చేస్తున్నాం అంటూ నాజర్ లుక్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మా పెద్దయ్యని పరిచయం చేస్తున్నాం!😊
Meet our Peddhayya @actornasser whose word is everything to Kishtayya❤️🔥#NaaSaamiRanga #NaaSaamiRangaOnJAN14 #NSRForSankranthi
KING👑 @iamnagarjuna @allarinaresh @mmkeeravaani @vijaybinni4u @itsRajTarun @AshikaRanganath @mirnaaofficial… pic.twitter.com/bNqvmilmT6
— Srinivasaa Silver Screen (@SS_Screens) January 6, 2024
కాగా ఈసినిమాలో అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఈసినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. మరి సంక్రాంతి బరిలో పలు సినిమాలు ఉండగా ఈసినిమా ఏమేరకు విజయాన్ని అందిస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: