ఘనంగా ప్రారంభమైన నారా రోహిత్ 20వ చిత్రం

Nara Rohit's 20th Movie Shoot Begins

టాలీవుడ్ హీరోలలో నారా రోహిత్‌ది ప్రత్యేక శైలి. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా భిన్నమైన కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలు చేస్తుంటారు. గత కొంతకాలంగా ఆయన నుంచి సినిమాలేవీ రాలేదు. అయితే ఇటీవలే ‘ప్రతినిధి 2’ తో మళ్లీ సినిమాల్లోకి కమ్‌బ్యాక్ ఇస్తున్నారు నారా రోహిత్. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మరో కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. కాగా ఇది రోహిత్‌కి 20వ చిత్రం (#NaraRohit20) కావడం విశేషం. ఈ మూవీని సందీప్ పిక్చర్ ప్యాలెస్ (ఎస్‌పీపీ) బ్యానర్‌పై సంతోష్ చిన్నపొళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళ్లి నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాతో వెంకటేష్ నిమ్మలపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. #NaraRohit20 అనేది ప్రతి వ్యక్తికి సాపేక్షంగా ఉండే అనేక రంగుల సూక్ష్మ నైపుణ్యాలతో నిండిన వినోదభరితమైన రోమ్-కామ్ అవుతుంది. శనివారం భారీ పూజా కార్యక్రమాలతో సినిమా ఘనంగా లాంచ్ అయింది. ఈ సందర్భంగా సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి మరియు విజయ్ కృష్ణ స్క్రిప్ట్‌ను మేకర్స్‌కి అందజేశారు. ఇక తొలి షాట్‌కి విజయ్‌కృష్ణ గౌరవ దర్శకత్వం వహించగా.. ప్రదీష్ ఎం వర్మ కెమెరా స్విచాన్ చేయగా, ముహూర్తం షాట్‌కి గౌతమ్‌రెడ్డి క్లాప్‌బోర్డ్‌ను వినిపించారు.

అనంతరం రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలవడం గమనార్హం. కాగా హీరో నారా రోహిత్ కెరీర్‌లో ల్యాండ్‌మార్క్‌గా నిలవనున్న ఈ మూవీలో శ్రీ దేవి విజయ్ కుమార్, వృతి వాఘని కథానాయికలు కాగా, నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరితోపాటు కమెడియన్ సత్య, అజయ్, VTV గణేష్, అభినవ్ గోమతం, విశ్వంత్, రూపా లక్ష్మి, సునైనా, రఘు బాబు తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రదీప్ ఎమ్ వర్మ సినిమాటోగ్రఫీ అందించగా, లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సందీప్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత కాగా, రాజేష్ పెంటకోట ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 6 =