ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర గ్లింప్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ గ్లింప్స్ ఈనెల 8న విడుదలకానుందని తెలిసిందే.ఇక ఇప్పుడు టైం కూడా చెప్పేశారు.సోమవారం సాయంత్రం 4:05 గంటలకు రిలీజ్ చేయనున్నామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఈ గ్లింప్స్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు సృష్టించాలనే వుంది.ఈ గ్లింప్స్ తో సినిమా ఎలా వుండబోతుందో చెప్పనున్నారు.గ్లింప్స్ మాత్రం అదిరిపోతుందట ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా భారీ విఎఫ్ఎక్స్ తో ఈగ్లింప్స్ రానుందట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వీటికి తోడు ఈవీడియోకి అనిరుధ్ ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.ఇక ఈసినిమా ఆడియో రైట్స్ ను టీ సిరీస్ సొంతం చేసుకుంది.అత్యంత భారీ ధరకు ఈ రైట్స్ ను సొంతం చేసుకుందని టాక్.
హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించనున్నాడు.వీరితోపాటు శ్రీకాంత్ ,షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషిస్తున్నారు.యువ సుధ ఆర్ట్స్,ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈసినిమా నిర్మిస్తున్నాయి.దేవర రెండు భాగాలుగా రానుందని తెలిసిందే.ఫస్ట్ పార్ట్ ఏప్రిల్ 5న విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























