ఉపేంద్ర UI సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్

upendra ui movie first look teaser out now

డిఫరెంట్ సినిమాలు, విభిన్నమైన పాత్రలు చేయడంలో కన్నడ విలక్షణ నటుడు ఉపేంద్ర కే సాధ్యం. తను చేసే సినిమాలు అన్నీ దాదాపు విభిన్నంగానే ఉంటాయి. “ఓం”, “ఏ” ,”రా” వంటి వెరైటీ టైటిల్స్ తో ప్రేక్షకులను అలరించిన ఘనత ఉపేంద్రకే దక్కుతుంది. ఇక ఇప్పుడు UI అనే టైటిల్ తో మరో డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు. ఈసినిమా మిడ్ 2000 బ్యాక్ డ్రాప్ లో రాబోతుందని ఇప్పటికే అర్థమైపోయింది. ఈసినిమా ఎప్పుడో మొదలవ్వగా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక చాలా రోజుల తరువాత ఈసినిమా నుండి ఒక అప్ డేట్ తో వచ్చారు మేకర్స్. వరల్డ్ ఆఫ్ UI పేరుతో ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేశారు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ చేతుల మీదుగా ఈ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజ‌ర్ చూస్తే సినిమా చాలా కొత్తగా ఉండబోతుందని అర్థమవుతుంది. ‘UI’ అనే ఫిక్ష‌న‌ల్ వ‌ర‌ల్డ్‌లో ఈ సినిమా స్టోరీ ఉండ‌నున్న‌ట్లు తెలుస్తుంది. క‌థ గురించి ఏ మాత్రం హింట్ ఇవ్వ‌కుండా ఫుల్ యాక్ష‌న్ ప్యాక్డ్‌గా ఈ టీజ‌ర్ సాగింది. ఇక ఈ మూవీలో ఉపేంద్ర దున్న‌పోతుపై ఎంట్రీ ఇవ్వడం మరో హైలెట్.

కాగా హీరోగా నటిస్తూనే ఉపేంద్ర ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈసినిమాలో రేష్మ, మురళీ శర్మ, నిధి సుబ్బయ్య, రవి శంకర్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ భారీ పాన్ ఇండియా యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీని లహరి ఫిలింస్ ఎల్ఎల్పీ, వీనస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా .జి. మనోహరన్, శ్రీకాంత్ కెపి నిర్మిస్తున్నారు. కాంతర ఫేమ్‌ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ విడుదల చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =