
ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 144


అల్లు శిరీష్ బడ్డీ ట్రైలర్ రిలీజ్ అప్ డేట్

కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు మెగాస్టార్ కృతజ్ఞతలు

డిప్యూటీ సీఎంతో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్

డార్లింగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

హాలీవుడ్ సినిమాలను సైతం బీట్ చేస్తోన్న కల్కి

N K R 21నుండి విజయశాంతి గ్లింప్స్ రిలీజ్

అన్నయ్య చిరంజీవిని కలవడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది

కల్కి ట్రైలర్ పై జక్కన్న ప్రశంసలు

తండేల్ వైజాగ్, శ్రీకాకుళం షెడ్యూల్ పూర్తి

NBK 109 లో కన్నడ స్టార్ నటుడు

హరిహర వీరమల్లు షూటింగ్ పై మేకర్స్ క్లారిటీ

100 కోట్ల దిశగా మహారాజా

డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో సాయి ధరమ్ 18

భారతీయుడు2 ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
స్టార్ డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా భారతీయుడు. 1996 లో వచ్చిన ఈసినిమా అప్పట్లో ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినీ చరిత్రలోనే ఈసినిమా కూడా ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోతుంది. ఇక ఈసినిమాకు సీక్వెల్ గా భారతీయుడు 2 ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే కదా. ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న ఈసినిమా రిలీజ్ డేట్ ను ఈమధ్యే ప్రకటించారు మేకర్స్. జులై 12వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

అల్లు శిరీష్ బడ్డీ ట్రైలర్ రిలీజ్ అప్ డేట్
బన్నీ తరువాత అల్లు ఫ్యామిలీ నుండి వచ్చిన మరో హీరో అల్లు శిరీష్. గౌరవం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. ఇక ఆ తరువాత నుండి పలు సినిమాలు చేస్తూ కెరీర్ ను కొననసాగిస్తున్నాడు. తన నుండి వచ్చిన చివరి సినిమా ఊర్వశివో..రాక్షసివో. ఆసినిమా తరువాత మరే సినిమాను ఇంతవరకూ రిలీజ్ చేయలేదు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా బడ్డీ. శామ్ ఆంటోన్ దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది.

కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు మెగాస్టార్ కృతజ్ఞతలు
కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు చెప్పారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఇలా తెలిపారు. "నిన్న రాత్రి ఆప్యాయంగా సందర్శించినందుకు ప్రియమైన సోదరుడు బండి సంజయ్‌కు ధన్యవాదాలు. మీ ప్రయాణానికి నేను హృదయపూర్వకంగా ఉన్నాను మరియు గౌరవనీయమైన హోం వ్యవహారాల రాష్ట్ర మంత్రిగా మీ బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించడంలో మీకు శుభాకాంక్షలు! దేవుడు అనుగ్రహించు గాక" అని పేర్కొన్నారు.

డిప్యూటీ సీఎంతో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్
మే 13వ తేదీన జరిగిన ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ సీట్లతో గెలిచిన విషయం తెలిసిందే కదా. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేయగా.. కూటమి ఘన విజయం సాధించింది. ఇక ఈ కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ జనసేన తీసుకున్న 21 అసెంబ్లీ సీట్లను గెలుచుకొని మరొక రికార్డును క్రియేట్ చేసింది. అంతేకాకుండా కూటమి విజయానికి ఒక పిల్లర్ గా నిలిచాడు. ఇదిలా ఉండగా ఇప్పటికే పవన్ డిప్యూటీ సీఎంగా భాద్యతలు చేపట్టారు. దానితో పాటు మంత్రిగా నాలుగు శాఖల బాధ్యతలను కూడా తీసుకున్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పవన్ కు…

డార్లింగ్ రిలీజ్ డేట్ ఫిక్స్
కమెడియన్ ప్రియదర్శి,యంగ్ హీరోయిన్ నభ నటేష్ జంటగా నటిస్తున్నసినిమా డార్లింగ్.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో వుంది.ఇక ఈసినిమా విడుదల తేది ఖరారైంది.జూలై 19న థియేటర్లలోకి రానుంది.రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా అశ్విన్ రామ్ తెరకెక్కిస్తున్న ఈసినిమాలో అనన్య నాగళ్ళ కీలక పాత్రలో కనిపించనుంది.వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.డార్లింగ్ ను హనుమాన్ ను నిర్మించిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి,చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు.దాంతో ఈ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి.

థీమ్ ఆఫ్ కల్కీ-శోభన అద్భుతమైన నృత్య ప్రదర్శన
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి 2898ఏడి సినిమా ఫ్యాన్స్ ఎంతలా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే కదా. వరుసగా అప్ డేట్లు ఇస్తూ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేశారు. ఇప్పటికే పలు పోస్టర్లు, టీజర్, రెండు ట్రైలర్ లను రిలీజ్ చేయగా అన్నీ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చారు. ఇక ఇప్పుడు మరో అప్ డేట్ ను ఇచ్చారు. థీమ్ ఆఫ్ కల్కి అనే పేరుతో ఓ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఈ వీడియోలో నటి శోభన పలువురు నృత్యకారులతో యమునా నది…

హాలీవుడ్ సినిమాలను సైతం బీట్ చేస్తోన్న కల్కి
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 AD’. టాలీవుడ్ యంగ్ అండ్ విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ ఈ సినిమా విజువల్ వండర్‌గా తెరకెక్కించారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొణే, దిశా పటానీ కథానాయికలుగా నటించగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, విశ్వ నటుడు కమల్ హాసన్, బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

N K R 21నుండి విజయశాంతి గ్లింప్స్ రిలీజ్
సరిలేరు నీకెవ్వరు తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది లేడీ సూపర్ స్టార్ విజయశాంతి.ఈసినిమాలో ఆమె ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించింది.అయితే ఈసినిమా తరువాత బిజీ అవుతుందనుకుంటే చాలా సెలెక్టెడ్ సినిమాలను ఎంచుకుంటుంది.ఇక చాలా గ్యాప్ తరువాత విజయశాంతి మరో సినిమా కు సైన్ చేసింది. అదే కళ్యాణ్ రామ్ నటిస్తున్న 21వసినిమా.

కల్కి బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 AD’. టాలీవుడ్ యంగ్ అండ్ విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ ఈ సినిమా విజువల్ వండర్‌గా తెరకెక్కించారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొణే, దిశా పటానీ కథానాయికలుగా నటించగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, విశ్వ నటుడు కమల్ హాసన్, బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ప్రముఖ సంస్థలకు స్వాగ్ ఆల్ ఇండియా థియేట్రికల్ రైట్స్
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. గత ఏడాది సామజవరగమన, ఈ ఏడాది ఓ భీమ్ బుష్ సినిమాలతో విజయాలను అందుకొని మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉండగా అందులో స్వాగ్ సినిమా ఒకటి. హసిత్ గోలి దర్శకత్వంలో ఈసినిమా రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే వరుసగా పోస్టర్లు, గ్లింప్స్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన రేజర్ పేరుతో వచ్చిన గ్లింప్స్ అయితే మరింత ఆకట్టుకుంది. శ్రీవిష్ణు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో…

అన్నయ్య చిరంజీవిని కలవడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది
అన్నయ్య చిరంజీవిని కలవడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని పేర్కొన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. ఈ మేరకు ఆయన ఆదివారం రాత్రి జూబ్లీహిల్స్ లోని మెగాస్టార్ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి కేంద్రమంత్రిని సాదరంగా ఆహ్వానించి పుష్పగుచ్ఛం అందించి, శాలువా కప్పి సత్కరించారు. ఇరువురూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని కుశలప్రశ్నలు వేసుకున్నారు.

కల్కి ట్రైలర్ పై జక్కన్న ప్రశంసలు
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో కల్కి 2898ఏడి రాబోతుంది. మహాభారతంతో మొదలై 2898 ఏడీ సంవత్సరంలో ముగుస్తుంది ఈ కథ. ఈసినిమా జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. తాజాగా సెకండ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ మరింత ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

తండేల్ వైజాగ్, శ్రీకాకుళం షెడ్యూల్ పూర్తి
యువ సామ్రాట్ నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ తండేల్. మత్స్యకారుడు గణగల్ల రామరావు జీవితాన్ని ఈసినిమా ద్వారా చూపిస్తున్నారు. ఇక యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈసినిమా కోసం నాగచైతన్య తన మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు. ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది.

మిస్టర్ బచ్చన్.. కశ్మీర్ వ్యాలీలో మెలోడీ డ్యూయెట్
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'మిస్టర్ బచ్చన్'. 'నామ్ తో సునా హోగా' అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోంది. క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోండగా.. సీనియర్ నటుడు జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దర్శకుడు హరీష్ శంకర్, జగపతి బాబు పాత్రని పవర్ ప్యాక్‌డ్‌గా ప్రజెంట్ చేస్తున్నారు.

ది గోట్ సెకండ్ సింగిల్ చిన్న చిన్న కంగల్ సాంగ్ రిలీజ్
దళపతి విజయ్ మాత్రం గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

NBK 109 లో కన్నడ స్టార్ నటుడు
బాలకృష్ణ గత ఏడాది వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ ను అందుకున్నాయి. ఇక ఈ ఏడాది మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ బాబి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటివరకూ టైటిల్ ను అయితే ఫిక్స్ చేయలేదు కానీ ఎన్బీకే 109 అనే టైటిల్ తోనే సినిమా షూటింగ్ ను చేస్తున్నారు. ఈసినిమా ఎప్పటినుండో షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. రీసెంట్ గా ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ తో అలరించాడు. గ్లింప్స్ తో బాలకృష్ణ మరోసారి మాస్ జాతర చూపించబోతున్నాడని అర్థమైంది.

హరిహర వీరమల్లు షూటింగ్ పై మేకర్స్ క్లారిటీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి రాబోతున్న సినిమాల్లో హరిహర వీరమల్లు సినిమా కూడా ఒకటి. క్రిష్ దర్శకత్వంలో మొఘలాయిల పాలన నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా ఈసినిమా వస్తుంది. ఈసినిమా ఎప్పుడో మొదలైన పవన్ రాజకీయాలతో బిజీ అవ్వడంతో లేట్ అవుతూ వచ్చింది. అయితే ఇప్పటివరకూ కొంత వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు. పవన్ రావడం ఒక్కటే లేటు.. ఆయన వస్తే మిగిలిన షూటింగ్ పూర్తి చేయడమే తరువాయి.

మన్మథుడులో అందుకు నాగార్జున ఒప్పుకోలేదు - విజయ్ భాస్కర్
టాలీవుడ్ సీనియర్ అండ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ కె విజయ్ భాస్కర్ ఎన్నో విజయవంతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లను ప్రేక్షకులకు అందించారు. ఆయన దర్శకత్వం వహించిన స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరి మరియు జై చిరంజీవ వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. గత కొన్నేళ్లుగా దర్శకత్వానికి దూరంగా ఉన్న ఆయన కొంత విరామం తర్వాత ఇప్పుడు 'ఉషాపరిణయం' అనే ఓ కొత్త సినిమాను తెరకెక్కించారు.

100 కోట్ల దిశగా మహారాజా
తమిళ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకవైపు హీరోగా చేస్తూనే మరోపక్క విలన్ పాత్రలు కూడా చేసుకుంటూ వెళ్తూ వరుస హిట్లను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా మహారాజా సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈసినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేశారు. ఈసినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. అంతేకాదు ఇప్పటికే 50 కోట్ల క్లబ్ లోకి కూడా చేరిపోయింది.

డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో సాయి ధరమ్ 18
గత ఏడాది విరుపాక్ష,బ్రో తో వచ్చి హిట్లు కొట్టాడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్.ఇక ఈసినిమాల తరువాత తన నెక్స్ట్ సినిమాకు మాత్రం చాలా గ్యాప్ తీసుకున్నాడు.నిజానికి బ్రో తరువాత సాయి ధరమ్,సంపత్ నంది డైరెక్షన్ లో గాంజా శంకర్ చేయాల్సివుంది కానీ ఆ సినిమా బడ్జెట్ కారణాల వల్ల ఆగిపోయింది. దాంతో ఈహీరో తన నెక్స్ట్ సినిమా కోసం మరో కథను ఫైనల్ చేశాడు. కొత్త దర్శకుడు రోహిత్ చెప్పిన కథ కు ఓకే చెప్పాడు.ఇది తన 18వ సినిమాగా రానుంది.విరూపాక్ష తరహాలో ఈ సారి కూడా డిఫ్రెంట్ కంటెంట్ తో రానున్నాడు.ఈసినిమా పీరియాడికల్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కనుంది.ఇందులో సాయి ధరమ్ పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నాడు.