గత ఏడాది విరుపాక్ష,బ్రో తో వచ్చి హిట్లు కొట్టాడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్.ఇక ఈసినిమాల తరువాత తన నెక్స్ట్ సినిమాకు మాత్రం చాలా గ్యాప్ తీసుకున్నాడు.నిజానికి బ్రో తరువాత సాయి ధరమ్,సంపత్ నంది డైరెక్షన్ లో గాంజా శంకర్ చేయాల్సివుంది కానీ ఆ సినిమా బడ్జెట్ కారణాల వల్ల ఆగిపోయింది. దాంతో ఈహీరో తన నెక్స్ట్ సినిమా కోసం మరో కథను ఫైనల్ చేశాడు. కొత్త దర్శకుడు రోహిత్ చెప్పిన కథ కు ఓకే చెప్పాడు.ఇది తన 18వ సినిమాగా రానుంది.విరూపాక్ష తరహాలో ఈ సారి కూడా డిఫ్రెంట్ కంటెంట్ తో రానున్నాడు.ఈసినిమా పీరియాడికల్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కనుంది.ఇందులో సాయి ధరమ్ పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈరోజే ఈసినిమాను అఫీషియల్ గా ప్రకటించారు.అనౌన్స్ మెంట్ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది.భారీ విఎఫ్ఎక్స్ తో ఈసినిమా ఉండనుంది.బ్లాక్ బాస్టర్ హనుమాన్ ను నిర్మించిన నిరంజన్ రెడ్డి,చైతన్య రెడ్డి తో కలిసి నిర్మిస్తున్నాడు.సాయి ధరమ్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇదే.షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం ఓ భారీ సెట్ లో తొలి షెడ్యూల్ జరుగుతుంది.త్వరలోనే మరిన్ని వివరాలను ప్రకటించనున్నారు.వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.పాన్ ఇండియా మూవీగా విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























