తమిళ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకవైపు హీరోగా చేస్తూనే మరోపక్క విలన్ పాత్రలు కూడా చేసుకుంటూ వెళ్తూ వరుస హిట్లను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా మహారాజా సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈసినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేశారు. ఈసినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. అంతేకాదు ఇప్పటికే 50 కోట్ల క్లబ్ లోకి కూడా చేరిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగులో కూడా ఈసినిమా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. తెలుగులో రిలీజ్ అయిన సినిమాలు కూడా ఒక మోస్తరు టాక్ నే సొంతం చేసుకోవడంతో ఈసినిమాకు మరింత ఆదరణ పెరిగింది. ఇక ఇప్పుడు ఈసినిమా వంద కోట్ల క్లబ్ దిశగా వెళుతుంది. తాజాగా ఈసినిమా కలెక్షన్స్ రిపోర్ట్ వచ్చేసింది. వారం రోజుల్లో ఈసినిమా 60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది. త్వరలోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరడం ఖాయమని అంటున్నారు సినీ విశ్లేషకులు.
కాగా ఈసినిమాలో ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్, మలయాళ నటి మమతా మోహన్ దాస్, అభిరామి, దివ్య భారతి, మునీష్ కాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్‌పై జగదీష్ పళని స్వామి, సుదన్ సుందరమ్ నిర్మించిన ఈసినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























