హరిహర వీరమల్లు షూటింగ్ పై మేకర్స్ క్లారిటీ

hari hara veera mallu movie makers clarity on when will pawan kalyan join in shoot

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి రాబోతున్న సినిమాల్లో హరిహర వీరమల్లు సినిమా కూడా ఒకటి. క్రిష్ దర్శకత్వంలో మొఘలాయిల పాలన నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా ఈసినిమా వస్తుంది. ఈసినిమా ఎప్పుడో మొదలైన పవన్ రాజకీయాలతో బిజీ అవ్వడంతో లేట్ అవుతూ వచ్చింది. అయితే ఇప్పటివరకూ కొంత వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు. పవన్ రావడం ఒక్కటే లేటు.. ఆయన వస్తే మిగిలిన షూటింగ్ పూర్తి చేయడమే తరువాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమా షూటింగ్ గురించి పలు వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఎలక్షన్స్ అయిపోయీయి.. రిజల్ట్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా, మంత్రిగా బాధ్యతలు కూడా చేపట్టారు. దీంతో పవన్ కళ్యాణ్ జులై ఫస్ట్ వీక్ నుండి షూటింగ్ లో పాల్గొంటారన్న వార్తలు జోరుగా ఊపందుకున్నాయి. అయితే ఈ వార్తలపై మేకర్స్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ జులై నుండి షూటింగ్ లో పాల్గొంటారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. ఆయన షూటింగ్ లో పాల్గొంటారు కానీ ఇప్పుడప్పుడే కాదు.. పవన్ పోర్షన్స్ చాలా తక్కువే ఉన్నాయి.. కొన్ని రోజులు సరిపోతుంది.. తనకు కాస్త ఫ్రీ టైమ్ దొరికినప్పుడు షూటింగ్ లో పాల్గొంటారని క్లారిటీ ఇచ్చారు.

మరోవైపు ఈసినిమా మిగిలిన షూటింగ్ ను క్రిష్ పర్యవేక్షణలో నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ పూర్తి చేయనున్నాడు. క్రిష్ వేరే ప్రాజెక్ట్ తో బిజీ అవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఈసినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్ నటిస్తుండగా.. అర్జున్‌ రాంపాల్‌, బాబి డియోల్, నోరా ఫతేహి కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ప్రముఖ సంగీత ద‌ర్శకుడు యం.యం.కీర‌వాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్ జ్ఞాన ‌శేఖ‌ర్ వి.ఎస్‌. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.