
ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 143


అల్లు శిరీష్ బడ్డీ ట్రైలర్ రిలీజ్

100 కోట్లకు చేరువలో మహారాజ

కల్కి రీజన్స్ టు వాచ్

ఆయ్.. రిలీజ్ డేట్ వచ్చేసింది

వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్న పవన్ కళ్యాణ్

నివేదా థామస్ కొత్త సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసిన నాగవంశీ

డబుల్ ఇస్మార్ట్ మ్యూజిక్ జాతర లోడింగ్

ఫస్ట్ హీరోయిన్ తో డిప్యూటీ సీఎం

కల్కి హైప్ మాములుగా లేదు

మెగాస్టార్, వినాయక్ గారితో మెమరబుల్ డే

మరోసారి అలా జరుగకుండా చూసుకుంటా - నాగార్జున

ఇండియన్ 2 ట్రైలర్ రిలీజ్
లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఇండియన్ 2. ఈసినిమా శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ అని అందరికీ తెలిసిందే. దాంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. జులై 12వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ను కూడా ఎప్పుడో మొదలుపెట్టారు. ఇప్పటికే రెండు పాటలన కూడా రిలీజ్ చేశారు. రెండు పాటలు కూడా మంచి…

అల్లు శిరీష్ బడ్డీ ట్రైలర్ రిలీజ్
చాలా గ్యాప్ తరువాత అల్లు శిరీష్ నుండి వస్తున్న సినిమా బడ్డీ. శాన్ ఆంటోని దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ఎంత సైలెంట్ గా మొదలైందో అంతే సైలెంట్ గా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే పలు పాటలను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.

100 కోట్లకు చేరువలో మహారాజ
కోలీవుడ్ వెర్సెటైల్ యాక్టర్, మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'మహారాజ'. విజయ్ సేతుపతి 50వ చిత్రంగా తెరకెక్కిన ఈ మైల్ స్టోన్ సినిమాకు 'కురంగు బొమ్మై' ఫేమ్ నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించారు. ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్, సీనియర్ నటీమణులు మమతా మోహన్ దాస్, అభిరామి, నట్టీ కీలక పాత్రలు పోషించారు. ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందిన 'మహారాజ' చిత్రానికి 'కాంతార' ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.

ఫ్యామిలీ స్టార్ హిందీ వెర్షన్ ఓటీటీ రిలీడ్ డేట్ ఫిక్స్
పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా వచ్చిన సినిమా ఫ్యామిలీ స్టార్. గీతా గోవిందం సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా కావడంతో ఈసినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది అని చెప్పొచ్చు.

కల్కి రీజన్స్ టు వాచ్
ప్రభాస్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి 2898ఏడి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఈసినిమా జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చిత్రయూనిట్. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈసినిమాకు సంతోష నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఎన్నో అంచనాల మధ్య వస్తున్న ఈసినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

ఆయ్.. రిలీజ్ డేట్ వచ్చేసింది
'మ్యాడ్' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నార్నె నితిన్ తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్నాడు. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా యూత్‌కు బాగా కనెక్ట్ కావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ కూడా రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో నితిన్ సోలో హీరోగా నటించిన సినిమా 'ఆయ్'. 'మేం ఫ్రెండ్సండి' అనేది ట్యాగ్ లైన్‌గా ఉంది.

వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్న పవన్ కళ్యాణ్
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 'వారాహి' అమ్మవారి దీక్షకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు జూన్ 26 నుండి ఆయన ఈ దీక్షను చేపట్టనున్నట్లు జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. రేపటినుంచి 11 రోజుల పాటు పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షలో ఉండనున్నారు. ఇక వారాహి అమ్మవారి దీక్ష సందర్భంగా, పవన్ కళ్యాణ్ సాత్వికాహారం స్వీకరించనున్నారు. దీనిలో భాగంగా ఈ 11 రోజుల దీక్షా కాలంలో ఆయన కేవలం పాలు, పండ్లు మరియు ద్రవపదార్థాలను మాత్రమే ఆహారంగా తీసుకోనున్నారు.

ఎమర్జెన్సీ.. కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన కంగనా రనౌత్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, జాతీయ ఉత్తమ నటి కంగనా రనౌత్ కీలక ప్రకటన చేసింది. ఆమె ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఎమర్జెన్సీ'. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తోంది కంగనా రనౌత్. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశవ్యాప్తంగా 1975 జూన్ 25 నుండి 1977 మార్చి 21 వరకు కొనసాగిన నిర్బంధ ఎమర్జెన్సీ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

నివేదా థామస్ కొత్త సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్
న్యాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన జెంటిల్ మెన్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నివేదా థామస్. ఈసినిమా సూపర్ హిట్ అయింది. దాంతో ఈసినిమా తరువాత నివేద థామస్ కు వరుసగా అవకాశాలు దక్కాయి. నిన్నుకోరి , జై లవకుశ , 118 , బ్రోచేవారెవరురా , వకీల్ సాబ్ ఇలా పలు హిట్లను కూడా అందుకుంది. ఇక తన నుండి వచ్చిన చివరి సినిమా శాకిని డాకిని. అయితే ఈ సినిమా తరువాత ఇప్పటి వరకూ నివేదా థామస్ నుండి ఎలాంటి సినిమా రాలేదు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసిన నాగవంశీ
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, ప్రముఖ సినీనటుడు పవన్ కల్యాణ్‌ను టాలీవుడ్ అగ్ర నిర్మాత ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ కలిశారు. సోమవారం తెలుగు చిత్ర పరిశ్రమ నిర్మాతల బృందంతో కలిసి ఆయన ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నారు. అనంతరం విజయవాడలోని క్యాంప్ ఆఫీసుకు చేరుకున్న పరిశ్రమ పెద్దలను పవన్ ఆత్మీయంగా తన ఛాంబర్‌లోకి ఆహ్వానించారు.

డబుల్ ఇస్మార్ట్ మ్యూజిక్ జాతర లోడింగ్
ఎనర్జిటిక్ హీరో రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈసినిమా బ్లాక్ బస్టర్ తరువాత దాని సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. దీంతో ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. ఆగష్ట్ 15వ తేదీ నుండి పుష్ప సినిమా తప్పుకోవడంతో ఈ తేదీని డబుల్ ఇస్మార్ట్ ను ఫిక్స్ చేశారు. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రొడ్యూసర్ దిల్ రాజు
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, ప్రముఖ సినీనటుడు పవన్ కల్యాణ్‌ను టాలీవుడ్ అగ్ర నిర్మాత ప్రొడ్యూసర్ దిల్ రాజు కలిశారు. సోమవారం తెలుగు చిత్ర పరిశ్రమ నిర్మాతల బృందంతో కలిసి ఆయన ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నారు. అనంతరం విజయవాడలోని క్యాంప్ ఆఫీసుకు చేరుకున్న పరిశ్రమ పెద్దలను పవన్ ఆత్మీయంగా తన ఛాంబర్‌లోకి ఆహ్వానించారు.

ఫస్ట్ హీరోయిన్ తో డిప్యూటీ సీఎం
మే 13వ తేదీన జరిగిన ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ సీట్లతో గెలిచిన విషయం తెలిసిందే కదా. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేయగా.. కూటమి ఘన విజయం సాధించింది. ఇక ఈ కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ జనసేన తీసుకున్న 21 అసెంబ్లీ సీట్లను గెలుచుకొని మరొక రికార్డును క్రియేట్ చేసింది. అంతేకాకుండా కూటమి విజయానికి ఒక పిల్లర్ గా నిలిచాడు. పవన్ డిప్యూటీ సీఎంగా.. మంత్రిగా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల బాధ్యతలను నిర్వర్తించనున్నారు.

భజే వాయు వేగం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ. రీసెంట్ గానే భజే వాయు వేగం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా యాక్షన్ ప్లస్ ఎమోషన్ డ్రామాాగా ఈసినిమా వచ్చింది. ఇక ఈసినిమాతో ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న కార్తికేయకు డీసెంట్ హిట్ అయితే దక్కింది. అంతేకాదు కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా మంచి కలెక్షన్సే అందించింది.

కల్కి 2898 AD: ఏపీలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపుకు అనుమతి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 AD’. టాలీవుడ్ యంగ్ అండ్ విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ ఈ సినిమా విజువల్ వండర్‌గా తెరకెక్కించారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొణే, దిశా పటానీ కథానాయికలుగా నటించగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, విశ్వ నటుడు కమల్ హాసన్, బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

విజయశాంతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కళ్యాణ్ రామ్
టాలీవుడ్ సీనియర్ నటి విజయశాంతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు హీరో నందమూరి కళ్యాణ్ రామ్. కాగా ప్రస్తుతం ఆమె కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతోన్న కొత్త చిత్రం (#NKR21)లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు విజయశాంతి జన్మదినం సందర్భంగా.. కళ్యాణ్ రామ్ సోషల్ మీడియా వేదికగా ఆమెకు బర్త్ డే విషెస్ తెలియజేశారు.

కల్కి హైప్ మాములుగా లేదు
రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898ఏడి కి హైప్ మాములుగా లేదు.లిమిటెడ్ ప్రమోషన్స్ చేసినా సినిమాకు ఊహించని హైప్ వచ్చింది.అడ్వాన్స్ బుకింగ్సే అందుకు నిదర్శనం.రిలీజ్ కు ఇంకా మూడు రోజుల సమయం వున్నా ఇప్పటివరకు 50కోట్లకు పైగా అడ్వాన్స్ సేల్స్ అయ్యాయి.దాంతో మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 100కోట్ల ఓపెనింగ్స్ ను కొల్లగొట్టనుంది.అదే జరిగితే ప్రభాస్ కు ఇది 5వ 100కోట్ల ఓపెనింగ్ సినిమా కానుంది.బాహుబలి 2,సాహో ,ఆదిపురుష్, సలార్ తో ప్రభాస్ ఇంతకుముందు ఈ ఫీట్ సాధించాడు.అంతేకాదు 5సార్లు 100కోట్లు ఓపెనింగ్ సాధించిన హీరోగా ప్రభాస్ రికార్డు సృష్టించనున్నాడు.

మెగాస్టార్, వినాయక్ గారితో మెమరబుల్ డే
బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాబోతున్న మోస్ట్ ఎవైటెడ్ మాగ్నమ్ ఓపస్ 'విశ్వంభర'. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కేవలం టైటిల్ గ్లింప్స్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు మేకర్స్. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. 'విశ్వంభర'తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి విశ్వంభర టీమ్ అన్నీ క్రాఫ్ట్స్ లో చాలా కేర్ తీసుకుంటుంది.

మరోసారి అలా జరుగకుండా చూసుకుంటా - నాగార్జున
టాలీవుడ్ అగ్ర నటుడు, స్టార్ హీరో అక్కినేని నాగార్జున ఒక అభిమానికి క్షమాపణ చెప్పారు. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్‌లో తన బాడీగార్డ్ చేసిన పనికి విచారణం వ్యక్తం చేసిన ఆయన మరోసారి అలా జరుగకుండా చూసుకుంటా అని హామీ ఇచ్చారు. కాగా నాగార్జున ప్రస్తుతం ‘కుబేర’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్నాడు.

సాంగ్ షూట్ లో డబుల్ ఇస్మార్ట్
రామ్- పూరి జగన్నాథ్ ల డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ ఫైనల్ కు చేరింది.ఈరోజు అల్యూమినియం ఫ్యాక్టరీ లో చివరి షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.ఇంకా రెండు పాటలు బ్యాలెన్స్ ఉండగా ఈరోజు నుండి స్పెషల్ సెట్ లో ఓ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు.ఇదే షెడ్యూల్ లో ఇంకో సాంగ్ ను కూడా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.దాంతో షూటింగ్ కంప్లీట్ కానుంది.జూలై నుండి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుకానున్నాయి.