దళపతి విజయ్ మాత్రం గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నేడు విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా నుండి అప్ డేట్లు వస్తున్నాయి. ఇప్పటికే బర్త్ డే షాట్స్ అంటూ యాక్షన్ ప్యాక్డ్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో ఉన్న గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇప్పుడు మరో అప్ డేట్ తో వచ్చారు. ఈసినిమా నుండి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేస్తున్నట్టు నిన్ననే తెలిపారు. దీనిలో భాగంగానే తాజాగా ఈపాటను రిలీజ్ చేశారు. చిన్న చిన్నకంగల్ అంటూ వచ్చే ఈపాట ఆకట్టుకుంటుంది. అయితే ఈపాటకు ఉన్న విశేషం ఏంటంటే ఇళయ రాజా కూతురు భవతరణి ఏఐ వాయిస్ తో ఈపాట రావడం. ఇంకా విజయ్, యువన్ శంకర్ రాజా కూడా ఆలపించారు.
కాగా సినిమాలో విజయ్ కు జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా స్నేహ, ప్రశాంత్, ప్రభుదేవా, జైరాం, లైలా, కమెడియన్, అజ్మల్, యోగిబాబు, వైభవ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అర్చన కల్పతి నిర్మిస్తున్నారు. యువన్‌శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























