యువ సామ్రాట్ నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ తండేల్. మత్స్యకారుడు గణగల్ల రామరావు జీవితాన్ని ఈసినిమా ద్వారా చూపిస్తున్నారు. ఇక యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈసినిమా కోసం నాగచైతన్య తన మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు. ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది. దీనిలో భాగంగానే కొద్ది రోజుల నుండి ఈసినిమా వైజాగ్, శ్రీకాకుళంలో జరుపుకుంటుంది. వైజాగ్, శ్రీకాకుళంలోని సహజమైన, అందమైన లోకేషన్స్ లో చిత్రీకరణ జరిపారు. తాజాగా ఈ రెండు ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసినట్టు చిత్రయూనిట్ తెలిపింది. నాగ చైతన్య, సాయి పల్లవి తో పాటు ఇతర కీలక నటీనటులు ఈ షెడ్యూల్ లో పాల్గొన్నారు. ఈనేపథ్యంలోనే
కాగా నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరూ తమ కెరీర్‌లో మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఇందులో డి-గ్లామరస్ అవతార్‌లలో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. షామ్‌దత్ సినిమాటోగ్రాఫర్, నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటర్. శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డిపార్ట్మెంట్ ని నిర్వహిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: