సరిలేరు నీకెవ్వరు తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది లేడీ సూపర్ స్టార్ విజయశాంతి.ఈసినిమాలో ఆమె ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించింది.అయితే ఈసినిమా తరువాత బిజీ అవుతుందనుకుంటే చాలా సెలెక్టెడ్ సినిమాలను ఎంచుకుంటుంది.ఇక చాలా గ్యాప్ తరువాత విజయశాంతి మరో సినిమా కు సైన్ చేసింది. అదే కళ్యాణ్ రామ్ నటిస్తున్న 21వసినిమా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో ఆమె పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది.ఈరోజు తన బర్త్ డే సందర్బంగా ఈసినిమా నుండి విజయ శాంతి క్యారెక్టర్ కు సంబంధించిన గ్లింప్స్ ను విడుదలచేశారు.యాక్షన్ ప్యాక్డ్ గా వచ్చిన ఈ గ్లింప్స్ ఆకట్టుకుంది.ఇందులో కళ్యాణ్ రామ్ ను కూడా చూపించారు. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది ఈసినిమా.
త్వరలోనే ఈసినిమా టైటిల్ ను ప్రకటించనున్నారు.ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో బాలీవుడ్ నటి సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా కాంతరా ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో ఎన్టీఆర్ ఆర్ట్స్ ,అశోక క్రియేషన్స్ బ్యానర్స్ పై సునీల్ బలుసు ,అశోక్ వర్ధన్ ముప్పా ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈఏడాది సెకండ్ హాఫ్ లో విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























