అన్నయ్య చిరంజీవిని కలవడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది

Minister of State For Home Affairs Bandi Sanjay Kumar Meets Megastar Chiranjeevi

అన్నయ్య చిరంజీవిని కలవడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని పేర్కొన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. ఈ మేరకు ఆయన ఆదివారం రాత్రి జూబ్లీహిల్స్ లోని మెగాస్టార్ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి కేంద్రమంత్రిని సాదరంగా ఆహ్వానించి పుష్పగుచ్ఛం అందించి, శాలువా కప్పి సత్కరించారు. ఇరువురూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని కుశలప్రశ్నలు వేసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అనంతరం దేశ, తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేదికపై ప్రత్యేకంగా చిరంజీవి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇరువురితో చేయి కలిపి ఫోటోలకు ఫోజులివ్వడం గురించి చిరంజీవి ప్రస్తావించారు. ఈ సంఘటన తన జీవితాంతం గుర్తుండిపోతుందని సంతోషంగా చెప్పారు. ఇక ఈ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ దీనిని గురించి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

ఈ సందర్భంగా ఒక పోస్ట్ పెట్టిన ఆయన, అందులో.. విద్యార్థి దశలో ఆయన సినిమాలకు తాను అభిమానినని, అన్నయ్య చిరంజీవిని కలవడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని అందులో పేర్కొన్నారు. కాగా ఇటీవలే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మరియు జనసేన పార్టీ ఎమ్మెల్యే, ఏపీ రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ కూడా చిరంజీవిని కలుసుకున్న విషయం తెలిసిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.