NBK 109 లో కన్నడ స్టార్ నటుడు

talented kannada actor rishi joins in nbk 109 movie talented kannada actor rishi joins in nbk 109 movie

బాలకృష్ణ గత ఏడాది వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ ను అందుకున్నాయి. ఇక ఈ ఏడాది మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ బాబి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటివరకూ టైటిల్ ను అయితే ఫిక్స్ చేయలేదు కానీ ఎన్బీకే 109 అనే టైటిల్ తోనే సినిమా షూటింగ్ ను చేస్తున్నారు. ఈసినిమా ఎప్పటినుండో షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. రీసెంట్ గా ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ తో అలరించాడు. గ్లింప్స్ తో బాలకృష్ణ మరోసారి మాస్ జాతర చూపించబోతున్నాడని అర్థమైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు తాజాగా ఈసినిమాలో నటిస్తున్న మరో నటుడి పాత్రకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో క‌వ‌లుదారి చిత్రం ఫేమ్ క‌న్న‌డ న‌టుడు రిషి విల‌న్ పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. రిషి పుట్టిన‌రోజు సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు.

కాగా ఈసినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తుండగా.. ఊర్వశి రౌతేలా కూడా నటిస్తుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.