మిస్టర్ బచ్చన్.. కశ్మీర్ వ్యాలీలో మెలోడీ డ్యూయెట్

Mr Bachchan Update Melody Duet Song Shoot Undergoing in Kashmir Valley

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్‌’. ‘నామ్ తో సునా హోగా’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోంది. క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోండగా.. సీనియర్ నటుడు జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దర్శకుడు హరీష్ శంకర్, జగపతి బాబు పాత్రని పవర్ ప్యాక్‌డ్‌గా ప్రజెంట్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన టైటిల్‌ పోస్టర్‌లో హీరో రవితేజ తన ఫేవరేట్ యాక్టర్‌ అమితాబ్‌ బచ్చన్ పోజ్‌లో కనిపించి అలరించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఇప్పటికే 90% షూటింగ్ పూర్తి చేసుకుని ముగింపు దశకు చేరుకుంది. తాజాగా మిస్టర్ బచ్చన్‌ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ వచ్చింది. ప్రస్తుతం బ్యూటీఫుల్ కశ్మీర్ వ్యాలీలో టీం సాంగ్ షూట్‌ జరుపుతోంది.

తాజా షెడ్యూల్‌లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సేపై బ్యూటీఫుల్ మెలోడీ డ్యూయెట్ ని షూట్ చేస్తున్నారు. ఈ పాటకు స్టార్ కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. కాశ్మీర్‌లోని అద్భుతమైన లోకేషన్ లో ఈ పాట చిత్రీకరణ గత నాలుగు రోజులుగా కొనసాగుతోంది. ఈరోజు ఈ సాంగ్ షూట్ చివరి రోజు. లొకేషన్ సెలెక్షన్, సాంగ్ జానర్ సినిమాలో విజువల్ ఫీస్ట్, ఎమోషనల్ ఎలిమెంట్ ని యాడ్ చేస్తోంది.

వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 90% చిత్రీకరణ పూర్తి కావడంతో, మిగిలిన పనులను త్వరగా పూర్తి చేసి వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, కెమెరామెన్ అయనంక బోస్ డీవోపీగా పని చేస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా.. ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.