మే 13వ తేదీన జరిగిన ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ సీట్లతో గెలిచిన విషయం తెలిసిందే కదా. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేయగా.. కూటమి ఘన విజయం సాధించింది. ఇక ఈ కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ జనసేన తీసుకున్న 21 అసెంబ్లీ సీట్లను గెలుచుకొని మరొక రికార్డును క్రియేట్ చేసింది. అంతేకాకుండా కూటమి విజయానికి ఒక పిల్లర్ గా నిలిచాడు. ఇదిలా ఉండగా ఇప్పటికే పవన్ డిప్యూటీ సీఎంగా భాద్యతలు చేపట్టారు. దానితో పాటు మంత్రిగా నాలుగు శాఖల బాధ్యతలను కూడా తీసుకున్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పవన్ కు కేటాయించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నేడు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ పవన్ కళ్యాణ్ ను కలిశారు. ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న నిర్మాతలు విజయవాడలోని క్యాంప్ ఆఫీసులో పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో అశ్వినీ దత్, అల్లు అరవింద్, రాధాకృష్ణ, దిల్ రాజు, డీవీవీ దానయ్య, బీవీఎస్ఎన్ ప్రసాద్, సుప్రియ, బన్నీవాసు తో పాటు పలువురు నిర్మాతలతో జరిగిన ఈ సమావేశంలో చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్థికి ఉన్న అవకాశాలు, ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ది గురించి చర్చించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కాగా ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సుజీత్ దర్శకత్వంలో రాబోతున్న ఓజీ సినిమా ఒకటి ఇంకా క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న హరిహర వీరమల్లు సినిమా ఒకటి. ఈ మూడు సినిమాలు కూడా షూటింగ్ దశలోనే ఉన్నాయి. మరి పూర్తిగా రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ ఈ మూడు సినిమాలను ఎప్పుడు కంప్లీట్ చేస్తారో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: