టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. గత ఏడాది సామజవరగమన, ఈ ఏడాది ఓ భీమ్ బుష్ సినిమాలతో విజయాలను అందుకొని మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉండగా అందులో స్వాగ్ సినిమా ఒకటి. హసిత్ గోలి దర్శకత్వంలో ఈసినిమా రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే వరుసగా పోస్టర్లు, గ్లింప్స్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన రేజర్ పేరుతో వచ్చిన గ్లింప్స్ అయితే మరింత ఆకట్టుకుంది. శ్రీవిష్ణు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నాడని అర్థమైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమాకు సంబంధించిన మరో అప్ డేట్ తో వచ్చారు మేకర్స్. ఈసినిమా థియేట్రికల్ రైట్స్ గురించి అప్ డేట్ ఇచ్చారు. ప్రముఖ సంస్థలు ఈసినిమా ఆల్ ఇండియా థియేట్రికల్ రైట్స్ ను దక్కించుకుంది. ఆ సంస్థలు మరేదో కాదు ఏషియన్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ వారు ఈ సినిమా ఆల్ ఇండియా థియేట్రికల్ రైట్స్ ను సొంతం చేసుకున్నారు. ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది.
కాగా ఈసినిమాలో రీతూవర్మ హీరోయిన్ గా నటిస్తుండగా.. మీరా జాస్మిన్, దక్షా నగార్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా.. వేద రామన్ శంకరన్ సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్నారు. జూలై ఫస్ట్ వీక్ లో ఈసినిమాను రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























