పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 AD’. టాలీవుడ్ యంగ్ అండ్ విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ ఈ సినిమా విజువల్ వండర్‌గా తెరకెక్కించారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొణే, దిశా పటానీ కథానాయికలుగా నటించగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, విశ్వ నటుడు కమల్ హాసన్, బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా కల్కి జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే, జూన్ 26నే నార్త్ అమెరికా (అమెరికా-కెనడా)లో స్పెషల్ ప్రీమియర్స్ వేయనున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో అక్కడ రికార్డు స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రీ-సేల్స్ పరంగా ఈ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ రికార్డును కూడా బద్దలుకొట్టేసింది. తాజాగా నార్త్ ఇండియా ప్రీ-సేల్స్‌లో ఏకంగా 3 మిలియన్ డాలర్ మార్క్ అందుకుని మరో భారీ మైల్‍స్టోన్ దాటింది కల్కి. అలాగే ప్రీమియర్స్ (సింగిల్ డే)లో 71,353 డాలర్స్ పైగా వసూళ్లు సాధించింది. తద్వారా హాలీవుడ్ చిత్రాలతో సహా ఏ సినిమాకైనా అత్యధిక ప్రీమియర్స్ సింగిల్ డే గ్రాస్‌గా నిలిచి రికార్డు సృష్టించింది.
కాగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంతకుముందెన్నడూ లేనివిధంగా అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ మల్టీలింగ్వెల్, మైథాలజీ-ఇన్స్ స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కి గ్రౌండ్ బ్రేకింగ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇటీవలే రిలీజ్ చేసిన ‘భైరవ ఆంథమ్’ ఇండియన్స్ బిగ్గెస్ట్ సాంగ్ అఫ్ ది ఇయర్‌గా టాప్ చార్ట్‌లో వుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























