
ట్యాగ్ · 48 కథనాలు


మ్యాడ్ టీజర్ రిలీజ్

స్కంద ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్

స్కంద ట్రైలర్ రిలీజ్

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్ రిలీజ్

గాంఢీవధారి అర్జున ట్రైలర్ రిలీజ్

సర్కారు నౌకరి టీజర్ రిలీజ్

ఆసక్తికరంగా ఉస్తాద్ ట్రైలర్

భోళా శంకర్ ట్రైలర్ రిలీజ్

సలార్ టీజర్ రిలీజ్

త్వరలో భోళా శంకర్ మెగా మ్యూజిక్ మేనియా

SSMB28 టైటిల్ రిలీజ్ టైమ్ ఫిక్స్

అన్నీ మంచి శకునములే ట్రైలర్ రిలీజ్

మళ్లీ పెళ్లి ట్రైలర్ రిలీజ్

అహింస రిలీజ్ డేట్ ఫిక్స్

ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్

నాగచైతన్య కస్టడీ ట్రైలర్ రిలీజ్

బిచ్చగాడు 2 ట్రైలర్ రిలీజ్

ఉగ్రం ట్రైలర్ రిలీజ్

రామబాణం ట్రైలర్ రిలీజ్..యాక్షన్ ప్లస్ ఎమోషన్

ఓజీ గ్లింప్స్ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓజీ గ్లింప్స్ కొద్దీ సేపటి క్రితం విడుదలైయింది.ఈరోజు పవన్ బర్త్ డే సందర్భంగా ఈటీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.100 సెకండ్ల రన్ టైంతో వచ్చిన ఈ గ్లింప్స్ హైప్ కు ఏమాత్రం తగ్గకుండా వుంది.గ్లింప్స్ అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ గా పవన్ రూత్ లెస్ గ్యాంగ్ స్టర్ గా కనిపించాడు.గ్లింప్స్ లో పవన్ లుక్,తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అయ్యింది.పవన్ ను ఇంతకుముందు ఎప్పుడూ చూపించని విధంగా చూపిస్తున్నాడు డైరెక్టర్ సుజీత్.

మ్యాడ్ టీజర్ రిలీజ్
నార్నె నితిన్,సంగీత్ శోభన్,రామ్ నితిన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం మ్యాడ్. కాలేజ్ బ్యాక్ డ్రాప్ తో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.ఈసినిమా టీజర్ ను ఈరోజు విడుదలచేశారు.ఇక ఈటీజర్ హిలేరియస్ గా వుంది.కాలేజ్ లో జరిగే గొడవలు,లవ్ స్టోరీ లు,ర్యాగింగ్ వంటి అంశాలను బేస్ చేసుకొని వస్తుంది ఈసినిమా.హ్యాపీ డేస్ టైపు సినిమా అనుకోవచ్చు.టీజర్ మాత్రం ప్రామిసింగ్ గా ఉంది.ఇలాంటి సినిమాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.పైగా సితార ఎంటెర్టైమెంట్స్ నుండి వస్తున్న సినిమా కావడం తో క్వాలిటీ విషయంలో డోకా ఉండదు.ఓవరాల్ గా టీజర్ తో హైప్ ను క్రియేట్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు.

స్కంద ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్
వారియర్ తరువాత ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన చిత్రం స్కంద.మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ తెరకెక్కిస్తుండగా శ్రీ లీల హీరోయిన్ గా నటించింది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో వుంది.ఇక ఈసినిమా నుండి మొన్న విడుదలైన ట్రైలర్ సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుని సినిమాకు భారీ హైప్ క్రీయేట్ చేసింది.ఇప్పటివరకు స్కంద తెలుగు వెర్షన్ ట్రైలర్ 24మిలియన్ల కు పైగా వ్యూస్ ను రాబట్టింది.బోయపాటి మార్క్ యాక్షన్ ప్యాక్డ్ గా వచ్చిన ఈ ట్రైలర్ లో రామ్ లుక్,ఫైట్స్ హైలైట్ అయ్యాయి.

స్కంద ట్రైలర్ రిలీజ్
రామ్ పోతినేని,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్కంద.అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఇటీవలే షూటింగ్ కూడా పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే విడుదలైన టీజర్ అలాగే సాంగ్స్ కు సూపర్ హైప్ వచ్చింది.ఇక ఈరోజు ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్ప కళా వేదిక లో జరిగింది.ఈవేడుక కు బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్ రిలీజ్
నవీన్ పోలిశెట్టి,అనుష్క జంటగా నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. అనౌన్స్ అయినప్పడినుండే ఈసినిమా హైప్ తెచ్చుకోగా రీసెంట్ గా రిలీజైన సాంగ్స్ ,టీజర్ తో ఆ హైప్ మరింత పెరిగింది. ఇక ఇప్పుడు తాజాగా ట్రైలర్ కూడా విడుదలైయింది.ఇక ఈ హిలేరియస్ ట్రైలర్ తో సినిమా పక్కా హిట్ అనేలా వుంది.

గాంఢీవధారి అర్జున ట్రైలర్ రిలీజ్
మెగా కాంపౌండ్ నుండి వచ్చిన హీరోల్లో మెగా ప్రిన్స్ గా పేరుతెచ్చుకున్న వరుణ్ తేజ్ మాత్రం తనకంటూ స్పెషల్ గా ఓ మార్క్ ను క్రియేట్ చేసుకోగలిగాడు. మొదటినుండీ కాస్త విభిన్నమైన సినిమాలు చేసుకంటూ అలానే మంచి విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాయి. అయితే గత ఏడాది వచ్చిన గని సినిమా అలానే ఎఫ్3 సినిమా కాస్త నిరాశను మిగిల్చాయి. ఇక ఇప్పుడు గాండీవధారి అర్జున అనే సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని వస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో స్టైలీష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది.

సర్కారు నౌకరి టీజర్ రిలీజ్
సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది సునీత. ఇక ఇప్పుడు ఆమె వారసత్వంతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు ఆకాష్ గోపరాజు. గంగనమోని శేఖర్ దర్శకత్వంలో ఆకాష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా సర్కారు నౌకరి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది ఈసినిమా. మరోవైపు చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు మేకర్స్. ఇక ఇటీవలే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. ఈసినిమా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో మంచి కంటెంట్ తో రాబోతుందని…

ఆసక్తికరంగా ఉస్తాద్ ట్రైలర్
మత్తు వదలరా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయమై మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్నాడు శ్రీసింహా. అంతేకాదు నటన పరంగా కూడా చాలామందిని ఆకట్టుకున్నాడు. మత్తువదలరా తరువాత ఆ రేంజ్ లో మరో హిట్ ను అందుకోలేకపోయాడు. ఆసినిమా తరువాత మూడు సినిమాలు తీసినా కూడా మూడు సినిమాలు కూడా సరైన విజయాన్ని అందుకోలేకపోయాయి. ఇప్పుడు శ్రీసింహా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఉస్తాద్ తో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది. ఆగష్ట్ 12వ తేదీన ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను…

భోళా శంకర్ ట్రైలర్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ భోళా శంకర్.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.ప్రమోషన్స్ లో భాగంగా కొద్దీ సేపటి క్రితం ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేత ట్రైలర్ ను లాంఛ్ చేయించారు మేకర్స్.ఇక ఈట్రైలర్ ను ఫ్యాన్స్ కు నచ్చేలా కట్ చేశారు.

సలార్ టీజర్ రిలీజ్
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సలార్ టీజర్ కొద్ది సేపటి క్రితం విడుదలైంది.ఇక ఈ టీజర్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా వుంది.ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్ తో టీజర్ ను నింపేశారు. అయితే ఈటీజర్ లో మాత్రం ప్రభాస్ లుక్ ను పూర్తిగా రివీల్ చేయలేదు కానీ సినిమా ఎలా వుండబోతుందో అని ప్రశాంత్ నీల్ చెప్పేశాడు.ఈటీజర్ వ్యూస్ విషయంలో కొత్త రికార్డులు క్రీయేట్ చేయనుంది.మొత్తానికి సలార్ టీజర్ ఫ్యాన్స్ ను పూర్తి స్థాయిలో సంతృప్తిపరిచింది.

త్వరలో భోళా శంకర్ మెగా మ్యూజిక్ మేనియా
మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది. ఇక ఆగష్ట్ 11వ తేదీన ఈసినిమా థియేటర్లలో రిలీజ్ కానున్నట్టు ఈమధ్యనే ప్రకటించారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈసినిమా చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజులుగా కోల్ కత్తాలో శరవేగంగా జరుగుతుంది. ఒకపక్క షూటింగ్ ను పూర్తిచేసుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకుంటుంది. ఇక ఇప్పుడు మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా మ్యూజికల్ అప్ డేట్స్ కూడా మొదలుపెట్టనున్నారు. భోళా శంకర్…

SSMB28 టైటిల్ రిలీజ్ టైమ్ ఫిక్స్
గత ఏడాది సర్కారు వారి పాట సినిమాతో సూపర్ హిట్ ను సొంతం చేసుకొని ప్రేక్షకులను అలరించిన మహేష్ బాబు ఇక ఇప్పుడు మరో సినిమాతో బిజీగా ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా కొత్త సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. అతడు, ఖలేజా సినిమాల తరువాత దాదాపు 12 ఏళ్ల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఇక ఈసినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూాశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమా సెట్స్ పైకే చాలా లేట్ గా వెళ్లింది. ప్రస్తుతం అయితే షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉన్నారు.

అన్నీ మంచి శకునములే ట్రైలర్ రిలీజ్
సంతోష్ శోభన్ హీరోగా నందిని రెడ్డి దర్శకత్వంలో అన్నీ మంచి శకునములే అనే టైటిల్ తో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాతో సంతోష్ శోభన్ మంచి హిట్ ను కొట్టాలని చూస్తున్నడు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ఈసినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు మేకర్స్. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి పోస్టర్లు, టీజర్ అలానే పాటలను కూడా రిలీజ్ చేయగా అవి సినిమాపై మంచి బజ్ నే క్రియేట్ చేశాయి. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే…

మళ్లీ పెళ్లి ట్రైలర్ రిలీజ్
ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన ఎం.ఎస్ రాజు ఇప్పుడు డైరెక్టర్ గా మారిన సంగతి తెలిసిందే కదా. తన దర్శకత్వం నుండి ప్రస్తుతం వస్తున్న సినిమా మళ్లీ పెళ్లి. నరేష్, పవిత్రాలోకేష్ ఈసినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఇది నరేష్ మినీ బయోపిక్ అని చెప్పొచ్చు. ఈసినిమాను మే 26 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుతూ బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమాలు పోస్టర్లు, టీజర్ అలానే పాటలు కూడా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు.ముఖ్యంగా టీజర్ తో ఈసినిమాపై ఆసక్తిని పెంచాడు. తన నిజ జీవితంలో జరిగిన సంఘటల…

అహింస రిలీజ్ డేట్ ఫిక్స్
దగ్గుబాటి ఫ్యామిలీ నుండి వస్తున్న మరో సినిమా అభిరామ్. తెలుగు ఇండస్ట్రీలోనే టాప్ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు తనయుడు.. రానా తమ్ముడు అభిరామ్ అవ్వడంతో తన ఎంట్రీ పై అందరికీ ఆసక్తి ఉంది. తేజ దర్శకత్వంలో అభిరామ్ హీరోగా వస్తున్న సినిమా అహింస. ఇక ఇప్పటికే విడుదలైన అభిరామ్ ప్రీ లుక్ పోస్టర్ దగ్గర నుండి టీజర్ వరకూ వచ్చిన ప్రతి అప్ డేట్ సినిమాపై ఆసక్తిని పెంచింది. అయితే ఈసినిమా ప్రమోషన్స్ ను అయితే చేస్తున్నారు కానీ రిలీజ్ డేట్ మాత్రం ఇంతవరకూ చెప్పలేదు. తాజాగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈసినిమా ను జూన్ 2వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్
ప్రభాస్ అభిమానులు, సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. ఆది పురుష్ ట్రైలర్ నేడు రిలీజ్ అయిపోయింది. ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతిససన్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా ఆదిపురుష్. రామాయణం నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. దీంతో ఈసినిమాపై మొదటి నుండి భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, టీజర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

నాగచైతన్య కస్టడీ ట్రైలర్ రిలీజ్
నాగచైతన్య హీరోగా తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్న సినిమా కస్టడీ. ఈసినిమాలో చైతు పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ్ లో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, సాంగ్స్, టీజర్, పోస్టర్స్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

బిచ్చగాడు 2 ట్రైలర్ రిలీజ్
విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో వచ్చిన బిచ్చగాడు సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే. 2016 లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా తమిళ్, తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇక ఈసినిమాతో విజయ్ ఆంటోని కూడా ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాకు విజయ్ ఆంటోనినే దర్శకత్వం వహించబోతున్నారు. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల కావాల్సి ఉండగా మే 19కి వాయిదా పడింది.

ఉగ్రం ట్రైలర్ రిలీజ్
కెరీర్ ప్రారంభం నుండి తన కామెడీ సినిమాలతో ప్రేక్షకులను కితకితలు పెట్టించిన అల్లరి నరేష్ ఇప్పుడు తన రూట్ ను మార్చాడు. ఇక చాలా కాలం గ్యాప్ తీసుకొని నాంది సినిమాతో మంచి కమ్ బ్యాక్ ను అందుకున్నాడు. ప్రస్తుతం విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఉగ్రం అనే సినిమాతో వస్తున్నాడు. నాంది సినిమా తరువాత వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా ఇది. ఆ సినిమా సక్సెస్‌తో మరోసారి వీరిద్దరూ ఇప్పుడు ఉగ్రం సినిమా కోసం చేతులు కలిపారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా వస్తున్నట్టు ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ను బట్టి అర్థమైంది. ఇకఈ సినిమా మే 5న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో వరుస అప్‌డేట్‌లు ప్రకటిస్తూ సినిమాపై ఆసక్తిని…

రామబాణం ట్రైలర్ రిలీజ్..యాక్షన్ ప్లస్ ఎమోషన్
యాక్షన్ హీరో గోపీచంద్ మాత్రం సరైన హిట్ కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. తను సాలిడ్ హిట్ కొట్టి చాలాకాలమే అయిపోయింది. మధ్యలో కొన్ని సినిమాలు పర్వాలేదు అనిపించాయి కానీ కమర్షియల్ గా మాత్రం సక్సెస్ కాలేదు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా రామబాణం. శ్రీవాస్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా మే 5 వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచింది. ఈనేపథ్యంలోనే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, పాటలు అన్నీ ఆకట్టుకున్నాయి.