మళ్లీ పెళ్లి ట్రైలర్ రిలీజ్

malli pelli movie trailer out now

ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన ఎం.ఎస్ రాజు ఇప్పుడు డైరెక్టర్ గా మారిన సంగతి తెలిసిందే కదా. తన దర్శకత్వం నుండి ప్రస్తుతం వస్తున్న సినిమా మళ్లీ పెళ్లి. నరేష్, పవిత్రాలోకేష్ ఈసినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఇది నరేష్ మినీ బయోపిక్ అని చెప్పొచ్చు. ఈసినిమాను మే 26 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుతూ బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమాలు పోస్టర్లు, టీజర్ అలానే పాటలు కూడా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు.ముఖ్యంగా టీజర్ తో ఈసినిమాపై ఆసక్తిని పెంచాడు. తన నిజ జీవితంలో జరిగిన సంఘటల ఆధారంగా ఈసినిమా తెరకెక్కించాడన్న విషయం అయితే అర్థమయిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఇప్పుడు ట్రైలర్ కూడా ఆకట్టుకుంటుంది. నరేష్, పవిత్రా లోకేష్ పరిచయం ప్రేమగా ఎలా మారింది అనే విషయాలతో పాటు మా ఎలక్షన్స్, బెంగళూరు ఎపిసోడ్, భార్యను ఆయన కాలి మీద తన్నడం లాంటి విషయాలను ట్రైలర్లో చూపించారు. ట్రైలర్ కూడా సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసింది. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

కాగా ఇంకా ఈసినిమాలో జయసుధ, శరత్‌బాబు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. వనిత విజయకుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తుండగా, అరుల్ దేవ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జునైద్ సిద్ధిక్ ఎడిటర్. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, భాస్కర్ ముదావత్ ప్రొడక్షన్ డిజైనర్. ఈ సినిమాతో లెజెండరీ ప్రొడక్షన్ హౌస్ విజయ కృష్ణ మూవీస్‌ సంస్థను పునః ప్రారంభించారు. దీనికి నరేష్ విజయ కృష్ణ నిర్మాత.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 2 =