త్వరలో భోళా శంకర్ మెగా మ్యూజిక్ మేనియా

bhola shankar movie music mania will start soon

మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది. ఇక ఆగష్ట్ 11వ తేదీన ఈసినిమా థియేటర్లలో రిలీజ్ కానున్నట్టు ఈమధ్యనే ప్రకటించారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈసినిమా చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజులుగా కోల్ కత్తాలో శరవేగంగా జరుగుతుంది. ఒకపక్క షూటింగ్ ను పూర్తిచేసుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకుంటుంది. ఇక ఇప్పుడు మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా మ్యూజికల్ అప్ డేట్స్ కూడా మొదలుపెట్టనున్నారు. భోళా శంకర్ మెగా మ్యూజిక్ మేనియా వచ్చేస్తోందంటూ.. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిరు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో చిరు కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. వీరితో పాటు రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను ఉన్నారు.ఇక ఈసినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 9 =