మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ భోళా శంకర్.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.ప్రమోషన్స్ లో భాగంగా కొద్దీ సేపటి క్రితం ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేత ట్రైలర్ ను లాంఛ్ చేయించారు మేకర్స్.ఇక ఈట్రైలర్ ను ఫ్యాన్స్ కు నచ్చేలా కట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
2నిమిషాల 25సెకండ్ల నిడివి తో వచ్చిన ఈ ట్రైలర్ లో చిరు లుక్, డైలాగ్స్,విజువల్స్ హైలైట్ అయ్యాయి.ట్రైలర్ లో ఫుల్ ఎనర్జీ తో కనిపించిన చిరు తెలంగాణ స్లాంగ్ డైలాగ్స్ తో అదరగొట్టాడు.ఓవరాల్ గా ట్రైలర్,సినిమా కు కావాల్సిన హైప్ ను తీసుకొచ్చింది.మెహర్ రమేష్ డైరెక్షన్ లో తమిళ సూపర్ హిట్ మూవీ వేదాలం కు రిమేక్ గా వస్తున్న ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించగా కీర్తి సురేష్,చిరు చెల్లెలిగా కనిపించనుంది.యంగ్ హీరో సుశాంత్ కీలక పాత్ర పోషించాడు.
మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తుండగా అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు.ఈ ఆగస్టు 11న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.అయితే అంత కన్నా ఒక్క రోజు ముందు సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న జైలర్ విడుదలకానుంది.సో జైలర్ రూపంలో బాక్సాఫీస్ వద్ద భోళా శంకర్ పోటీ ఎదుర్కొనున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: