
ట్యాగ్ · 242 కథనాలు · పేజీ 7


డబల్ హ్యాట్రిక్ తో ఎన్టీఆర్ రికార్డ్

RRR తెలుగు మూవీ పబ్లిక్ టాక్

సీక్వెల్ మూవీ పై ఎన్టీఆర్ కామెంట్

స్పీడు పెంచుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్

రామ్ చరణ్ తో స్నేహం ఈనాటిది కాదు - ఎన్టీఆర్

ముత్తాత(ఎన్టీఆర్)పోలికలతో భార్గవ్ రామ్

మరో మల్టీ స్టారర్ ఛాన్స్ వస్తే వారితో చేస్తా..!

తిరుమల శ్రీవారి సన్నిధి లో ఎన్టీఆర్ ఫ్యామిలీ

ఎన్టీఆర్ ఆల్ రౌండర్ స్టార్ - పాయల్ ఘోష్

"#NTR30" మూవీ లో జంటగా ఎన్టీఆర్ , అలియా భట్

'ఆర్ఆర్ఆర్' కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

ఎప్పటికీ మీరే ధ్రువ తార..!

న్యూ లుక్ లో ఎన్టీఆర్

'రౌడీ బాయ్స్' ట్రైలర్ రిలీజ్

'రౌడీ బాయ్స్'.. ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్

త్వరగా కోలుకో అన్నా - ఎన్టీఆర్

రాజమౌళి కి బిర్యాని.. చరణ్ కి పానీ పూరీ

"ఆర్ ఆర్ ఆర్ " కొమరం భీముడో సాంగ్ పై ఎన్టీఆర్ స్పందన
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ ఈ రోజు (మార్చి 25 వ తేదీ) ప్రపంచవ్యాప్తంగా 10, 000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. .అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.

డబల్ హ్యాట్రిక్ తో ఎన్టీఆర్ రికార్డ్
“నిన్ను చూడాలని “మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ “స్టూడెంట్ నెం 1” తో కమర్షియల్ హీరోగా మారారు. "ఆది ", "సింహాద్రి ", "సాంబ ", ", యమదొంగ " , బృందావనం" వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో ఎన్టీఆర్ తనదైన స్టైల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోగా మారారు. తరువాత ఎన్టీఆర్ కథానాయకుడిగా తెరకెక్కిన కొన్ని సినిమాలు పరాజయం పాలయ్యాయి.

'ఆర్ఆర్ఆర్' రివ్యూ.. అద్భుతం, విజువల్ ఫీస్ట్
మొత్తానికి రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో మరో సంచలనం సృష్టించాడు. తన నుండి సినిమా వస్తే బాక్సాఫీస్ వద్ద ఎలా ఉంటుందో మరోసారి నిరూపించాడు. తన రికార్డులు తానే చెరిపేసుకోనున్నాడు. ఇప్పటి వరకూ నాన్ బాహుబలి రికార్డులు అనే వారు.. ఇక నుండి నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డులు అని చెప్పుకునే పరిస్థితి వచ్చేలా ఉంది. ఇక ఈసినిమాను ప్రతి ఒక్కరూ చూసి విజువల్ ఫీస్ట్ ను ఆస్వాదించాల్సిందే.

RRR తెలుగు మూవీ పబ్లిక్ టాక్
We are experiencing the most powerful film in Indian Film Industry all over the world 🌎 #RRRMovie NTR annaya #tarak9999 expressions and performance in…

సీక్వెల్ మూవీ పై ఎన్టీఆర్ కామెంట్
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై వివి వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం తో తెరకెక్కిన యాక్షన్ కామెడీ "అదుర్స్ "మూవీ ఘనవిజయం సాధించింది. నయనతార , షీలా కథానాయికలు. బ్రహ్మానందం , ఎమ్ ఎస్ నారాయణ , మహేష్ మంజ్రేకర్ , ఆశిష్ విద్యార్థి , రఘు బాబు ముఖ్య పాత్రలలో నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. హీరో ఎన్టీఆర్ చారి , నరసింహా క్యారెక్టర్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా చారి క్యారెక్టర్ లో ఎన్టీఆర్ కామెడీ ని అద్భుతంగా పండించారు. ఎన్టీఆర్ - బ్రహ్మానందం , బ్రహ్మానందం - ఎమ్ ఎస్ నారాయణ కాంబినేషన్ సీన్స్ నవ్వులు పూయించాయి. ప్రతీ క్యారెక్టర్ కు కామెడీ టచ్…

స్పీడు పెంచుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్
హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ , పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన యాక్షన్ డ్రామా"అరవింద సమేత వీర రాఘవ "మూవీ 2018 అక్టోబర్ 18 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఆ మూవీ తరువాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన "రౌద్రం రణం రుధిరం "మూవీ తో ఎన్టీఆర్ మమేకం అయ్యారు. ఈ మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భా రీ ఎత్తున రిలీజ్ కానుంది. "ఆర్ ఆర్ "ఆర్"మూవీ ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ బిజీగా వున్నారు.

రామ్ చరణ్ తో స్నేహం ఈనాటిది కాదు - ఎన్టీఆర్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జంటగా అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జంటగా ఒలీవియా మోరిస్ నటించిన , భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన “ఆర్ ఆర్ ఆర్ “మూవీ రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ భారీ ఎత్తున ప్రమోషన్స్ నిర్వహిస్తుంది.

'ఆర్ఆర్ఆర్' ఎక్స్ పీరియన్స్ గురించి ఎన్టీఆర్ మాటల్లో..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమా కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25 న రిలీజ్ కు సిద్దమవుతుంది. దీనిలో భాగంగా ఈ సినిమా ప్రమోషన్స్ మళ్లీ స్టార్ట్ చేశారు మేకర్స్. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ మళ్లీ హుషారుగా బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నారు. ఇక ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్ పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు.

ముత్తాత(ఎన్టీఆర్)పోలికలతో భార్గవ్ రామ్
లెజెండరీ యాక్టర్ నందమూరి తారకరామారావు మనవడు , ఫిల్మ్ యాక్టర్ , పొలిటీషియన్ హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్ తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. నార్నే ఎస్టేట్స్ అధినేత నార్నే శ్రీనివాస్ తనయ లక్ష్మి ప్రణతిని 2011 సంవత్సరంలో ఎన్టీఆర్ వివాహం చేసుకున్నారు. వీరికి అభయ్ రామ్ , భార్గవ్ రామ్ తనయులు.

మరో మల్టీ స్టారర్ ఛాన్స్ వస్తే వారితో చేస్తా..!
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఇద్దరు స్టార్ హీరోలు కాకుండా అందలోనూ ఎన్టీఆర్-రామ్ చరణ్ కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమా కోసం కేవలం ఎన్టీఆర్-చరణ్ అభిమానులు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత మూడేళ్లుగా ఎదురుచూస్తున్న ఎదురుచూపులకు ఫైనల్ గా మార్చి 25 న బ్రేక్ పడనుంది. ఇక దీంతో చిత్రయూనిట్ మళ్లీ ప్రమోషన్ కార్యక్రమాలను స్టార్ట్ చేశారు. ఇప్పటికే రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు.

తిరుమల శ్రీవారి సన్నిధి లో ఎన్టీఆర్ ఫ్యామిలీ
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన "ఆర్ ఆర్ ఆర్ " మూవీ ప్రపంచవ్యాప్తంగా మార్చి 25 వ తేదీ రిలీజ్ కానుంది. ఆ మూవీ ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న "#NTR 30" మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఆ మూవీ ప్రమోషన్స్ లో కూడా ఎన్టీఆర్ బిజీగా ఉండడంతో ఎన్టీఆర్ మినహా మిగిలిన కుటుంబ సభ్యులంతా తిరుమలకు వెళ్లారు.

ఎన్టీఆర్ ఆల్ రౌండర్ స్టార్ - పాయల్ ఘోష్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన "రౌద్రం రణం రుధిరం " మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. సక్సె ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో "#NTR30" మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కథానాయికగా ఎంపిక అయ్యారు.త్వరలోనే "#NTR30" మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది.

"#NTR30" మూవీ లో జంటగా ఎన్టీఆర్ , అలియా భట్
యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా “#NTR30” మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న“#NTR30” మూవీ లో ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఎంపిక అయ్యారు. రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన "రౌద్రం రణం రుధిరం" మూవీ లో రామ్ చరణ్ కు జోడీగా నటించిన అలియా “#NTR30” మూవీ లో ఎన్టీఆర్ కు జోడీగా నటించడం విశేషం.

'ఆర్ఆర్ఆర్' కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
దేశవ్యాప్తంగా సినీ లవర్స్ ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఒకటని చెప్పొచ్చు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-చరణ్ ప్రధాన పాత్రల్లో ఈ క్రేజీ మల్టీస్టారర్ తెరకెక్కింది. మూడేళ్లుగా ఈసినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఎన్నో రిలీజ్ డేట్ లు మారాయి. ఇక ఫైనల్ గా ఈ ఏడాది సంక్రాంతికి ఈసినిమా విడుదల అవుతుందని అందరూ వేయి కళ్లతో ఎదురుచూశారు. కానీ కరోనా థర్డ్ వేవ్ వల్ల మళ్లీ రిలీజ్ కు బ్రేక్ పడింది. థియేటర్లలో ఆక్యుపెన్సీ తగ్గడం.. దానికి తోడు కొన్ని చోట్ల థియేటర్లు కూడా మూత పడటంతో రిలీజ్ ను వాయిదా వేశారు. మళ్లీ ఎప్పుడు విడుదల చేస్తామని ప్రకటించలేదు. కేవలం సరైన సమయం చూసుకొని విడుదల…

ఎప్పటికీ మీరే ధ్రువ తార..!
తెలుగువారి గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియచేసిన వారిలో ఎంతోమంది ఉండగా అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది నట సార్వభౌముడు నందమూరి తారకరామారావు గురించి. తెలుగు సినీ చరిత్రలో ఆయన సృష్టించిన సంచలనాలు, నెలకొల్పిన రికార్డులు అనేకం. తెలుగు చలన చిత్ర రంగంలోనే కాదు... యావత్ ప్రపంచ చలన చిత్ర రంగంలోనే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ నెలకొల్పినన్ని రికార్డులు నెలకొల్పటం మరి ఏ ఇతర నటుడికి సాధ్యం కాదు. సాంఘిక, పౌరాణిక ఇలా ఏ పాత్ర చేసినా సరే ఆ పాత్రలో ఆ పాత్ర తన కోసమే పుట్టిందేమో అన్నట్టు ఉంటుంది. సినీ చరిత్రలో ఆయన చేసిన అద్భుతాలు ఎన్నో. అలాంటి నటుడు ఇంత వరకూ రాలేదు.. ఇకపై కూడా అలాంటి నటుడిని చూడటం అనేది…

న్యూ లుక్ లో ఎన్టీఆర్
“నిన్ను చూడాలని “మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ “స్టూడెంట్ నెం 1” తో కమర్షియల్ హీరోగా మారారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో ఎన్టీఆర్ తనదైన స్టైల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోగా రాణిస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం”మూవీ జనవరి 7వ తేదీ రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న “#NTR30” మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

'రౌడీ బాయ్స్' ట్రైలర్ రిలీజ్
ఈ ఏడాది సంక్రాంతికి పెద్ద సినిమాలు బరిలో లేకపోవడంతో చిన్న హీరోలు అందరూ సంక్రాంతికి పోటీకి దిగుతున్నారు. అందులో రౌడీ బాయ్స్ సినిమా కూడా ఒకటి. ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేస్తున్నారు. ప్రొడ్యూసర్ శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ , పాటలుప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మొదటి సినిమా అయినప్పటికీ ఫుల్ ఎనర్జీతో ఆశిష్ చేసిన డాన్సులు, ఫెర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకున్నాడు.

'రౌడీ బాయ్స్'.. ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ నుండి టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నహీరో ఆశిష్. ‘హుషారు’ ఫేమ్ శ్రీహర్ష దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. జనవరి 14న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచేశారు మేకర్స్. ఇక దిల్ రాజు ఫ్యామిలీ నుండి వస్తున్న హీరో కాబట్టి ప్రమోషన్స్ ఏ రకంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే చూశాం కూడా. ఇంకా రిలీజ్ కు వారం రోజులు ఉంది కాబట్టి ఈ వారం రోజులు గట్టిగానే సినిమా ప్రమోషన్స్ చేయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగానే రేపు ట్రైలర్ రిలీజ్ కు కూడా ముహూర్తం ఫిక్స్…

త్వరగా కోలుకో అన్నా - ఎన్టీఆర్
కరోనా మహమ్మారి ఫస్ట్ , సెకండ్ వేవ్ లతో ప్రపంచవ్యాప్తం గా ప్రజలను పలు విధాలా ఇబ్బందులకు గురి చేసింది. ఇప్పుడు థర్డ్ వేవ్ తో విజృంభించి ప్రజలపై తన ప్రతాపం చూపుతుంది. రోజు రోజుకూ కరోనా వైరస్ తీవ్రత అధికమవుతుంది. రోజుల వ్యవధిలో వేలల్లో కేసులు నమోదవుతున్నాయి.టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖులకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు కరోనా పాజిటివ్ అని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

రాజమౌళి కి బిర్యాని.. చరణ్ కి పానీ పూరీ
దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు చరణ్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆశగా ఎదురుచూశారు. అన్నీ అనుకున్నట్టు ఉండి ఉంటే రేపు రిలీజ్ అయి ఉండేది. కానీ అందరినీ నిరాశ పరస్తూ మళ్లీ వాయిదా పడింది. ఒమిక్రాన్ ప్రభావం రోజు రోజుకి పెరగడంతో.. కొన్ని చోట్ల థియేటర్లు కూడా మూసేయడంతో ఇలాంటి పరిస్థితుల్లో రిలీజ్ చేయడం కష్టం కాబట్టి ఆర్ఆర్ఆర్ టీమ్ సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. మరి ఎప్పుడు రిలీజ్ అవుతుందన్నది మాత్రం వేచి చూడాల్సిందే.