రాజమౌళి ఇది పేరు కాదు సినిమాకు బ్రాండ్. బాహుబలి సిరీస్ తో రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచడమే కాదు మన తెలుగు సినిమా సత్తాను బాక్సాఫీస్ వద్ద చూపించాడు రాజమౌళి. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో వచ్చేశాడు. ఈసినిమాపై కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు విదేశాల్లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. ఫైనల్ గా ఎంతోకాలం నుండి ఎదురుచూస్తున్న అభిమానులు పండగ చేసుకునే టైమ్ వచ్చేసింది. ఈసినిమా నేడు రిలీజ్ అయి ప్రేక్షకులముందుకు వచ్చింది. మరి ఆర్ఆర్ఆర్ ప్రభంజనం ఏ మేరకు ఉందో ఒకసారి చూద్దాం..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, ఒలివియా మోరిస్, అజయ్ దేవగన్, శ్రియ, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి తదితరులు
డైరెక్టర్.. ఎస్.ఎస్ రాజమౌళి
బ్యానర్.. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్
నిర్మాత.. దానయ్య
సంగీతం.. ఎమ్.ఎమ్ కీరవాణి
సినిమాటోగ్రఫి.. సెంథిల్
కథ: విజయేంద్ర ప్రసాద్
మాటలు: సాయి మాధవ్ బుర్రా
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
కథ..
ఈ కథ గురించి ఇప్పటికే చాలా మందికి ఒక ఐడియా వచ్చి ఉంటుంది. 1920 కాలంలో పీరియాడికల్ డ్రామాగా ఈసినిమా తెరకెక్కింది. ఆదిలాబాద్ అడవుల నుంచి కొందరు తెల్లదొరలు మల్లి అనే ఒక గొండు పాపను తీసుకెళతారు. ఇక ఆ పాపను కాపాడటానికి కొమరం భీమ్ (ఎన్టీఆర్) ప్రయత్నాలు చేస్తుంటాడు. మరోవైపు అల్లూరి సీతారామరాజు (రామ్ చరణ్) బ్రిటీష్ ప్రభుత్వం కొరకు పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో కొమరం భీమ్ ను పట్టుకునే బాధ్యతను రామరాజుకు ఇస్తారు బ్రిటీషర్స్. అలాంటి వారిద్దరూ ఎలా కలిశారు.. ఎలా స్నేహితులు అయ్యారు? బ్రిటీషర్స్ కు ఎలా ఎదురుతిరిగి పోరాటం చేశారు..? అన్నది ఈసినిమా కథ.
ఇక ఇలాంటి సినిమాల గురించి మాట్లాడుకోవాలంటే హిట్ అయిందా లేదా? ఎవరెవరూ ఎలా చేశారు?అన్న రొటీన్ విషయాలు వదిలిపెట్టాల్సిందే. ఎందుకంటే ఈసినిమా డైరెక్టర్ రాజమౌళి.. రాజమౌళి సినిమా అంటే హిట్ అనేది చిన్న పదమే అవుతుంది. ఇక నటీనటుల గురించి అంటే జక్కన్న అని రాజమౌళిని ఊరికే అనలేదు కదా. వారి నుండి తనకు కావాల్సిన అవుట్ పుట్ వచ్చేంత వరకూ ఓ పట్టాన వదిలి పెట్టడు. సో అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్, కొమరం బీమ్ పాత్రలో యంగ్ టైగర్ అద్భుతంగా చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈసినిమా హిట్ కు ప్రధానమైన కారణాల గురించి మాట్లాడుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..
రాజమౌళి.. కొడితే కుంభస్థలం కొట్టాలి అన్న సామెత రాజమౌళి కి కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఎందుకంటే తన సినిమాలు అలానే ఉంటాయి కాబట్టి. ఏదో కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టేశాం.. స్టార్ హీరోలు ఉన్నారు.. సినిమా తీసేశాం అన్నట్టు ఉందడు. తను తీసే ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనం ఉండేలా చూసుకుంటాడు. తనకి తానే పోటీ.. ప్రతి సినిమా ఓ సవాల్. సినిమా మొదలైన దగ్గర నుండి చివరి వరకూ ప్రేక్షకుడు ఎక్కడా బోర్ కొట్టకుండా అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. కథ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో అలానే కథాంశం, విజువల్స్, సినిమాటోగ్రఫి, సంగీతం ఇలా అన్ని విషయాలు పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకుంటాడు. నిజానికి ఇది ఒక యూనిక్ కథ అని చెప్పొచ్చు. ఎందుకంటే చరిత్రలో జరదని ఒక కథని రాసుకొని దానిని ప్రేక్షకులకు చూపించడానికి సిద్దమయ్యాడు. కొమరంభీమ్, సీతారామరాజు ఇద్దరూ వారి వారి జీవితాల్లో ఎన్నడూ కలుసుకోలేదు.. కానీ ఒక సమయంలో ఇంటి నుండి వెళ్లిపోయిన వారిద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన నుండి రాజమౌళి ఈసినిమా కథకు బీజం పడింది. మరి టాప్ హీరోల మల్టీస్టారర్ అనగానే.. ఎవరి పాత్ర ఎలా ఉంది..? ఎవరి ఎలివేషన్ ఎలా ఉంది..? ఎవరిది పై చేయి..? అంటూ ఇలా ఎన్నో డౌట్స్ వస్తుంటాయి. కానీ అక్కడఉంది జక్కన్న కదా.. ఇద్దరినీ చాలా బ్యాలెన్డ్ గా చూపించి ఫ్యాన్స్ ను కూడా ఖుషీ చేసేశాడు.
ఎన్టీఆర్-రామ్ చరణ్.. ఈసినిమాలో హీరోయిలుగా ఎన్టీఆర్-చరణ్ ను తీసుకొనే సగం సక్సెస్ కొట్టాడు రాజమౌళి. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో ఈసినిమా రావడం ఈసినిమాకే హైలెట్. ఇక కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటన గురించి మాటల్లేవ్, మాట్లాడుకోటాల్లేవ్ అన్న డైలాగ్ వేసుకోవాల్సిందే. వీరిద్దరూ లేకపోతే ఈసినిమానే లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇద్దరూ సినిమాకు ప్రాణం పోశారు. నువ్వా నేనా అన్నట్టు తన పాత్రల్లో జీవించేశారు. ఇద్దరి పాత్రల మధ్య ఎమోషన్స్ గుండె బరువెక్కేలా ఉన్నాయి. ఇద్దరు స్టార్లు వారి పాత్రల్లో ఒదిగిపోయిన తీరు, పోరాట ఘట్టాల్లో అభినయం చాలా బాగుంది. ఇక ‘నాటు నాటు’ పాటలో ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేసిన తీరు మహా అద్భుతం. ఇక ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ సీత పాత్రలో ఒదిగిపోయింది. అజయ్ దేవగణ్ పాత్ర సినిమాకి కీలకం. ఇక మిగిలిన నటీనటులు తమ పాత్రల మేర నటించారు.
హైలెట్ ఎలిమెంట్స్.. ఈసినిమాలో కావల్సినన్నీ హైలెట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. రాజమౌళి సినిమా అంటే మేకింగ్ లో ఎలాంటి లోపాలు వెతాకాల్సిన అవసరం లేదు. చూడాల్సింది ఎన్ని హైలెట్ సీన్స్ ఉన్నాయన్నది మాత్రం. ఎన్టీఆర్-పులి మధ్య వచ్చే సీన్ చాలా బాగుంటుంది. ఇంకా ఇంటర్వెల్ కు ముందు వచ్చే ఎపిసోడ్ ఎవరి ఊహలకు అందదు. ఇద్దరు హీరోల మధ్య ఫైట్ చూస్తోంటే.. మాస్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ లా కనిపిస్తుంది. ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్ లు సినిమాలో చాాలానే ఉంటాయి. దీంతో ప్రేక్షకులంతా తెలియకుండానే కథలో లీనమైపోతారు. నాటు నాటు సాంగ్ థియేటర్ లో చూస్తే అరుపులే.
టెక్నీషియన్స్.. ఇలాంటి విజువల్ వండర్ సినిమాలు ఇంత అద్భుతంగా రావాలంటే దానికి తెరవెనుక పనిచేసే ఎంతో మంది కష్టం కూడా ఉంటుంది. అంటే సాంకేతిక విభాగం అన్నమాట. అయితే రాజమౌళి సినిమాలకు కొంతమంది మాత్రం ఆస్థాన టెక్నీషియన్స్ ఉంటారు. వారిలో ఎమ్ఎమ్ కీరవాణి ఒకరు, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ఒకరు. ఎప్పటిలాగే వారి పని వారు పర్ఫెక్ట్ గా చేసుకొని వెళ్లిపోయారు. కీరవాణి పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొడితే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి మరో లెవల్ లో ఉంటుంది. అద్భుతమైన స్టంట్స్ అందించిన స్టంట్ మాస్టర్స్ ఎందరో ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఒక సినిమా ఇంత గ్రాండియర్ గా రావడానికి కావాల్సింది మంచి నిర్మాత. ఒక సినిమాను బలంగా నమ్మి నిర్మాత డబ్బు పెట్టగలిగితేనే ఇలాంటి అవుట్ పుట్ వస్తుంది. ఆ విషయంలో నిర్మాత దానయ్య ను అభినందించాల్సిందే. ఇంత భారీ బడ్జెట్ తో ఈసినిమాను నిర్మించారు.
మొత్తానికి రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో మరో సంచలనం సృష్టించాడు. తన నుండి సినిమా వస్తే బాక్సాఫీస్ వద్ద ఎలా ఉంటుందో మరోసారి నిరూపించాడు. తన రికార్డులు తానే చెరిపేసుకోనున్నాడు. ఇప్పటి వరకూ నాన్ బాహుబలి రికార్డులు అనే వారు.. ఇక నుండి నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డులు అని చెప్పుకునే పరిస్థితి వచ్చేలా ఉంది. ఇక ఈసినిమాను ప్రతి ఒక్కరూ చూసి విజువల్ ఫీస్ట్ ను ఆస్వాదించాల్సిందే.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: